Minister KTR : మోదీ వల్లే RRRకి ఆస్కార్ వచ్చిందని అంటారేమో-కేటీఆర్ సెటైర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో అని ఆయన సెటైర్ వేశారు. తన ట్వీట్ తో పొలిటికల్ గా మంట పెట్టారు కేటీఆర్.

Minister KTR : మోదీ వల్లే RRRకి ఆస్కార్ వచ్చిందని అంటారేమో-కేటీఆర్ సెటైర్

Minister KTR : RRR మూవీ నాటు నాటు సాంగ్ కి ప్రతిష్టాత్మక ఆస్కార్ రావడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది. మూవీ టీమ్ ను అందరూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా మంత్రి
కేటీఆర్ సెటైర్లు వేశారు.

మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో అని ఆయన సెటైర్ వేశారు. తన ట్వీట్ తో పొలిటికల్ గా మంట పెట్టారు కేటీఆర్. ఆస్కార్ అవార్డు అంశం ద్వారా కొంత సెటైరికల్ గా బీజేపీని కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందేమో అంటారేమో అంటూ కొంత
వ్యంగ్యంగా ట్వీట్ చేశారు కేటీఆర్.

Also Read..Amit Shah..’Washing Powder Nirma’ : ‘వాషింగ్ పౌడర్ నిర్మా’యాడ్‌తో అమిత్‌షాకు స్వాగ‌తం..!

కొన్ని రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణతో మాటల యుద్ధం మరింత ముదిరింది. కవిత్ టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ పైనా విరుచుకుపడుతున్నారు. అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కవిత ఈడీ విచారణ ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అంటున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు.

Also Read..RRR ‘Naatu Naatu Oscars95’ : RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం : మంత్రి తలసాని

ప్రధానిగా మోదీ ఉండటం వల్లే.. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని బీజేపీ నేతలు చెప్పుకుంటారేమో అని వెటకారంగా కేటీఆర్ ట్వీట్ చేసినట్లుగా ఉంది. రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఏ అంశంలో పురోగతి జరిగినా తమ ఘనతగా బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని, ఈ క్రమంలో ఆస్కార్ అవార్డు కూడా తమ వల్లే వచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారేమో అనే అర్థం వచ్చేలా కేటీఆర్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ లాంటి నేతలను తన ట్వీట్ కింద ట్యాగ్ చేయడంతో.. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.