Osmania University: ఓయూ 82వ స్నాతకోత్సవం, సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్

ఉస్మానియా యూనివర్సిటీ. ఆ విశ్వ విద్యాలయానికి శుక్రవారం 82వ స్వాతకోత్సవం జరగనున్న క్రమంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు వేడుక ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు.

Osmania University: ఓయూ 82వ స్నాతకోత్సవం, సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్

Osmania University: హైదరాబాద్ ఎడ్యుకేషన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఉస్మానియా యూనివర్సిటీ. ఆ విశ్వ విద్యాలయానికి శుక్రవారం 82వ స్వాతకోత్సవం జరగనున్న క్రమంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు వేడుక ప్రారంభమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు. ఓయూ గెస్ట్‌హౌజ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం, కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీ నగేశ్‌లతో కలిసి వీసీ ప్రసంగించారు. వేడుకకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అధ్యక్షత వహిస్తారని, చీఫ్ గెస్ట్‌గా జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని ఇస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ఓయూ నుంచి 48వ గౌరవ డాక్టరేట్‌ ఎన్వీ రమణకు అందుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు లా విభాగంలో 29, సాహిత్యంలో 12, సైన్స్‌లో 6 గౌరవ డాక్టరేట్‌లను ఓయూ ప్రదానం చేసిందని వివరించారు. వారిలో 18 మంది ప్రముఖులు, 8 మంది రాజ కుటుంబీకులు, ఆరుగురు విదేశీ ప్రముఖులు, నలుగురు నేషనల్ లీడర్లు, నలుగురు లాయర్లు, ముగ్గురు ప్రెసిడెంట్లు, ఇద్దరు పీఎంలు, ఇద్దరు కవులు ఉన్నారని వివరించారు.

అక్టోబర్‌ 2021 నుంచి జూలై 2022 మధ్య పరీక్షలు పాసైన వారికి మాత్రమే పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 55 గోల్డ్ మెడల్స్‌ను 31 మంది విద్యార్థులను వరించనున్నాయని, వారిలో నలుగురు అబ్బాయిలు కాగా, 27 మంది అమ్మాయిలు కావడం విశేషమని ప్రశంసించారు.

260 మంది పీహెచ్‌డీ పట్టాలు పొందేందుకు అప్లై చేసుకోగా, వారిలో 96 మంది పురుషులు కాగా, 143 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా 76 మంది ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ నుంచి, 35 మంది ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ నుంచి పీహెచ్‌డీ పట్టాలు అందుకోనున్నారు.