Osmania University : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 8 నుంచి పెండింగ్ పరీక్షల నిర్వహణ

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలో పెండింగ్‌లో ప‌డిన‌ అన్ని ప‌రీక్ష‌ల‌ను జూలై 8 నుంచి నిర్వ‌హించ‌నున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Osmania University : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 8 నుంచి పెండింగ్ పరీక్షల నిర్వహణ

Ou Pending Exams From July 8th

Osmania University : ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలో పెండింగ్‌లో ప‌డిన‌ అన్ని ప‌రీక్ష‌ల‌ను జూలై 8 నుంచి నిర్వ‌హించ‌నున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఓయూ ప‌రిధిలోని అన్ని కాలేజీల్లో బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డ‌బ్ల్యూ కోర్సుల‌కు సంబంధించిన మూడో, ఐదో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ఈ ఏడాది మార్చి/ఏప్రిల్ నెల‌ల్లో జ‌రగాల్సి ఉంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఆ ప‌రీక్ష‌లను నిర్వహించలేకపోయారు. దాంతో పెండింగ్ ప‌రీక్ష‌లు అన్నింటినీ ఈ నెల 8 వ తేదీ నుంచి నిర్వ‌హించాల‌ని యూనివర్సిటీ అధికారులు నిర్ణ‌యించారు.

పరీక్ష‌లకు సంబంధించి గ‌తంలో విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేద‌ని, గ‌త మార్చిలో విద్యార్థులకు జారీచేసిన హాల్‌టికెట్ల‌లో ఏవైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లోనే ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని ఓయూ అధికారులు తెలిపారు. అయితే ప‌రీక్షల స‌మ‌యాన్ని మూడు గంట‌ల‌కు బ‌దులుగా రెండు గంట‌ల‌కు కుదించిన‌ట్లు వెల్ల‌డించారు. ఆ మేర‌కు ప్ర‌శ్న‌ల సంఖ్య‌, మార్కుల‌లో కూడా మార్పులు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

డిగ్రీ మూడో, ఐదో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు రోజు మార్చి రోజు కాకుండా అన్ని రోజుల్లో జ‌రుగుతాయ‌ని, క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ రోజుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం కోసం తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు ఓయూ అధికారులు వివ‌రించారు. అంతేగాక ఐదో సెమిస్ట‌ర్ పూర్తయిన విద్యార్థుల‌కు విద్యాసంవ‌త్స‌రం వృథా కాకుండా ఆరో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వీలవుతుంద‌ని తెలిపారు. విద్యార్థులు అందరూ ఇందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు.