Singareni Oxygen : సింగరేణి ఆస్పత్రిలో ప్రారంభమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి

కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. నిమిషానికి 200 లీటర్ల చొప్పున రోజుకు 40 సిలిండర్ల సామర్థ్యంతో ఉత్పత్తి జరుగనుంది.

Singareni Oxygen : సింగరేణి ఆస్పత్రిలో ప్రారంభమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి

Singareni Oxygen

Singareni Oxygen : కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. నిమిషానికి 200 లీటర్ల చొప్పున రోజుకు 40 సిలిండర్ల సామర్థ్యంతో ఉత్పత్తి జరుగనుంది. టర్కీ నుంచి విమానం ద్వారా ప్లాంటు స్పేర్ పార్టులను దిగుమతి చేసుకోనున్నారు. పదమూడో రోజుల్లోనే ప్లాంటును ప్రారంభించారు. ప్లాంటులో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పైపుల ద్వారా వార్డుల్లోని పేషెంట్లకు సరఫరా చేయనున్నారు.

ఆక్సిజన్ ప్లాంట్లను భూపాలపల్లి, రామకృష్ణాపూర్‌, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రులకు అనుబంధంగా పది రోజుల్లో ప్రారంభించనున్నారు. ఒక్కో ప్లాంటు నిర్మాణం, రెండేళ్ల నిర్వహణకు రూ.35 లక్షలు ఖర్చు పెడుతున్నారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో గంటకు 45 క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం కల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.