Odisha To Telangana : హైదరాబాద్ కు ఆక్సిజన్ ట్యాంకర్లు

ఆక్సిజన్..ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరాయి.

Odisha To Telangana : హైదరాబాద్ కు ఆక్సిజన్ ట్యాంకర్లు

Oxygen

Oxygen Tankers : ఆక్సిజన్..ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరాయి. ఒడిశా రాష్ట్ర నుంచి 2021, ఏప్రిల్ 26వ తేదీ సోమవారం సాయంత్రం ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. మొత్తం 5 ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నట్లు సమాచారం. ఒక్కో ట్యాంకర్ లో 16 మెట్రిక్ టన్నుల లిక్సిడ్ ఆక్సిజన్ ఉంది. ఆర్టీసీ డ్రైవర్లు కీలక పాత్ర పోషించారు.

రోడ్డు మార్గాన వచ్చిన ఈ ట్యాంకర్లు గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి. అనంతరం కరీంనగర్, కింగ్ కోఠి, చర్లపల్లి, ఛాతి ఆసుపత్రి, ఖమ్మం ఆసుపత్రులకు ట్యాంకర్లను తరలిస్తున్నారు అధికారులు. ప్రైవేటు ఆసుపత్రుల వినియోగం కోసం ఒక ట్యాంకర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ఒక్కో ట్యాంకర్ వెళ్లనుంది. ఇటీవలే యుద్ధ విమానాల్లో 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోసం 9 ట్యాంకర్లను ప్రభుత్వం తరలించిన సంగతి తెలిసిందే.

మంత్రి ఈటెల స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ఒడిశా రాష్ట్రానికి చేరుకున్న అనంతరం ఈ ట్యాంకర్లు రోడ్డు మార్గాన తెలంగాణకు వచ్చాయి. ఇక కరోనా విషయానికి వస్తే..కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అత్యవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ట్యాంకర్లు రావడంతో..కొంత ఆక్సిజిన్ కొరత తీరే అవకాశం ఉంది.

Read Mork : Andhra Pradesh : 9 వేల 881 కరోనా కేసులు, 24 గంటల్లో 51 మంది మృతి