Paidi Rakesh Reddy : కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీయే : పైడి రాకేష్ రెడ్డి

ప్యాకేజి కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీయే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఎన్నికలొస్తే ఒకరిపై మరొరకు విమర్శలు చేసుకుంటారు. ఎన్నికలు అయిపోయాక దోస్తీ కడుతారని..అలా బయటకు డ్రామాలాడతారి ఎద్దేవా చేశారు.

Paidi Rakesh Reddy : కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీయే : పైడి రాకేష్ రెడ్డి

Paidi Rakesh Reddy

Paidi Rakesh Reddy join BJP : ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ రాకేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన సందర్భంగా రాకేశ్ రెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీయేనని అన్నారు. కవితను నిజామాబాద్ నుంచి కాకుండా మెదక్ నుంచి పోటీ చేయించటానికి ఆమె తండ్రి కేసీఆర్ చూస్తున్నారని..తండ్రి మాటలు విని కవతి నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని అక్కడి నుంచి పారిపోద్దని సూచించారు.

 

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత నేను తండ్రి మాట విననట్లే కవిత కూడా కేసీఆర్ మాట వినకుండా నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ విఫలమైందని..పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్యాకేజి కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారంటూ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీయేనన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఎన్నికలొస్తే ఒకరిపై మరొరకు విమర్శలు చేసుకుంటారు. ఎన్నికలు అయిపోయాక దోస్తీ కడుతారని..అలా బయటకు డ్రామాలాడతారి ఎద్దేవా చేశారు.

 

Tarun Chugh : బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి .. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ ఛుక్

 

కాంగ్రెస్ లో గెలిచినోళ్లు బీఆర్ఎస్ చేరటం కొత్త కాదు అంటూ గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలను గుర్తు చేస్తు రాకేశ్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పుకు ఓటు వేస్తారని..కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ధర్మపురి అరవింద్ భారత్ అంటేనే బీజేపీ విదేశాల్లోనోని ఇండియన్స్ అందరు గర్వంగా భావిస్తున్నారని..అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదు తెలంగాణాలో రౌడీలా రాజ్యం నడుస్తుందన్నారు. మోదీ నాయకత్వం నచ్చే బీజేపీలో చేరానని..పార్టీ కార్యకర్తగా ఉంటూనే పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చిన అంకిత భావంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.