Palla Rajeshwarreddy : నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు దిశగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్‌రెడ్డి 24, 671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Palla Rajeshwarreddy : నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు దిశగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Palla Rajeshwarreddy

Palla Rajeshwarreddy towards victory : నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్‌రెడ్డి 24, 671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లక్షా 32వేల 921 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్నకు లక్షా 8 వేల 250 ఓట్లు వచ్చాయి. ప్రొఫెసర్ కోదండరాం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తైతే… గెలుపెవరిది అనే విషయాన్ని అధికారులు ప్రకటిస్తారు.

మరోవైపు హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు పొందారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి లక్షా 49 వేల 269 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతలో లక్షా 12 వేల 689 ఓట్లు రాగా.. రెండో ప్రాధాన్యతలో 36 వేల 580 లభించాయి.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు టీఆర్ఎస్‌కు మోదాన్ని కలిగిస్తే బీజేపీకి ఖేదాన్ని కలిగించాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని వ్యూహరచన చేసింది. విజయం సాధించింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఎదురుదెబ్బకు ప్రతీకారం తీర్చుకునేలా పకడ్బందీగా వ్యవహరించింది అధికారపార్టీ. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి ఎంపికలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

గెలుపు బాధ్యతలను పార్టీ నేతలకు అప్పగించింది. భవిష్యత్తులో జరిగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వాణీదేవికి మంత్రిపదవి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇవి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలే అయినప్పటికీ ఆరు ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకున్నట్లయ్యింది.