Parboiled Rice from Telangana : తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అంగీకారం

Parboiled Rice from Telangana : తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రం నుంచి మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Parboiled Rice from Telangana : తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అంగీకారం

Centre Govt green signal To Procure 8 Lakh Metric Tonnes Of Parboiled Rice

Parboiled Rice from Telangana : తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రం నుంచి మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ ఈ విషయం గురించి కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

2021-22 రబీ సీజన్‌లో పండించిన 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్దంగా ఉన్నట్టు కేంద్రం లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05 లక్షల టన్నులకు అదనంగా.. బియ్యం సేకరించాలని నిర్ణయించినట్టుగా కేంద్రం లేఖలో పేర్కొంది. దీనికి అనుగుణంగా ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది.

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమ నిర్ణయాలకు ఇది మరొక ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశ్యంతో కేంద్రప్రభుత్వం అదనపు బియ్యం సేకరణకు ఈ నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి అన్నారు.