Durgam Cheruvu Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తే రూ. 2 వేలు జరిమానా

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. ఇటీవల అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి చాలా మంది సందర్శకులు తమ వాహనాలను వంతెనపై నిలుపుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కూడా వాహనాలను వంతెనపై పార్కింగ్ చేస్తున్నారు.

Durgam Cheruvu Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తే రూ. 2 వేలు జరిమానా

Durgam Cheruvu Cable Bridge : థ్రిల్ కోరుకునేవారు, ఫోటోగ్రఫీ ఔత్సాహికులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్తున్నారా? అయితే టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల్లో అక్కడికి వెళ్లే ముందు పోలీసుల హెచ్చరికలను గమనించండి! దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు.  బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయవద్దని ఇటీవల అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి చాలా మంది సందర్శకులు తమ వాహనాలను వంతెనపై నిలుపుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కూడా వాహనాలను వంతెనపై పార్కింగ్ చేస్తున్నారు.

ఈ ఐకానిక్ స్పాట్‌కి కొందరు సెల్ఫీలు తీసుకోవడానికి వస్తే, మరికొందరు సమయాన్ని వృథా చేయడానికి వస్తుంటారు. అక్కడికి వచ్చి వారు తమ కారును పార్క్ చేసి బయటకు వచ్చి ప్రాణాలకు హాని కలిగే విధంగా బ్రిడ్జీ అంచుపైకి వంగి కెమెరా ఫోన్ లతో ఫోటోలు తీసుకుంటారు. అయితే, పోలీసులు కూడా ప్రాంతంపై దృష్టి పెట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చలాన్‌ను వేయనున్నారు. చీకటి సమయంలో పోలీసులకు కనబడదని భావిస్తే పొరపాటే. రాత్రిపూట కూడా వంతెనను పర్యవేక్షించడానికి పోలీసుల వద్ద ప్రత్యేక కెమెరాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు.

Karimnagar Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలో మరో అద్భుతం, కరీంనగర్‌లో త్వరలో అందుబాటులోకి..

వంతెనపై వాహనాలను పార్కింగ్ చేసినందుకు రూ. 200 నుండి రూ. 2,000 జరిమానా వరకు ఉంటుంది. ఫోటోలు, పుట్టినరోజు వేడుకలు లేదా స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్తే అధిక మొత్తంలో జరిమానా చెల్లించాల్సివుంటుంది. ప్రజలు తమ వాహనాలను వంతెనపై పార్క్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను అర్థం చేసుకోవాలని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసు అధికారి చెప్పారు.

సందర్శకులు, ప్రయాణీకుల భద్రత చాలా ముఖ్యమని తెలిపారు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు. బ్రిడ్జిపై పార్కింగ్ నిషేధాన్ని అమలు చేసేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. గస్తీని పెంచారు. లేట్ అవర్స్ లో కెమెరాలు 24×7కాలం పాటు ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. వంతెనపైకి వచ్చే సందర్శకులందరికీ భద్రత కల్పించాలనుకుంటున్నామని, అందుకు తమకు ప్రజల సహకారం అవసరమని అధికారి తెలిపారు.