Auto Driver : శబాష్ ఆటో డ్రైవర్.. కూతురు పెళ్ళికి దాచుకున్న డబ్బుని..

తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు బ్యాగ్ అందులోనే వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆటో డ్రైవర్ ఆ బ్యాగ్ తీసుకెళ్లి నేరుగా పోలీసులకు అప్పగించాడు.

Auto Driver : శబాష్ ఆటో డ్రైవర్.. కూతురు పెళ్ళికి దాచుకున్న డబ్బుని..

Auto Driver

Auto Driver : తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు బ్యాగ్ అందులోనే వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆటో డ్రైవర్ ఆ బ్యాగ్ తీసుకెళ్లి నేరుగా పోలీసులకు అప్పగించాడు. వివరాల్లోకి వెళితే ధూల్‌పేటలో నివసించే రాంరాజ్‌ తివారీ అనే అర్చకుడు సోమవారం ఉదయం తన కూతురు వివాహానికి సంబంధించి రూ.1.25 లక్షల నగదుతో పాటు వివాహ పత్రికలను ఓ బ్యాగులో సర్దుకొని బంజారాహిల్స్‌రోడ్‌ నెం. 12లోని గుడిలో పూజ చేయించేందుకు షేక్‌పేటలో ఆటో ఎక్కారు.

చదవండి : Auto Driver : రెండు చక్రాలపై ఆటో నడిపి గిన్నీస్‌ రికార్డు సాధించిన ఆటో డ్రైవర్

బ్యాగ్‌ని ఆటోలోనే వదిలేసి దిగిపోయాడు తివారీ.. కొద్దీ దూరం వెళ్లిన తర్వాత గమనించిన ఆటో డ్రైవర్ హుస్సేన్ ఆ నగదు బ్యాగ్ తీసుకోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించేందుకు వచ్చారు. ఇదే సమయంలో తివారీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అప్పటికప్పుడే ఆ నగదు సంచిని పోలీసులు రాంరాజ్‌ తివారీకి ఆటో డ్రైవర్‌ చేతుల మీదుగా బంజారాహిల్స్‌ ఎస్‌ఐలు కె. ఉదయ్, అజయ్‌ కుమార్‌లు అప్పగించారు.

చదవండి : Auto Driver : రెండు చక్రాలపై ఆటో నడిపి గిన్నీస్‌ రికార్డు సాధించిన ఆటో డ్రైవర్

ఆటోడ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు అభినందించి ప్రోత్సాహక బహుమతి అందచేశారు. ఇక తివారీ ఆటో డ్రైవర్ కి కృతఙ్ఞతలు తెలిపారు. ఇది కూతురు పెళ్లికోసం దాచుకున్న డబ్బని. బ్యాగ్ మర్చిపోవడంతో గుండె ఆగినంత పనైందని.. ఆటోడ్రైవర్ దేవుడలా వచ్చి తన బ్యాగ్ ఇచ్చారని కొనియాడారు.