Tandur MLA Vs MLC : తాండూరు తగదా..ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ, అసలు ఏమి జరిగింది ?

గెలుపు గుర్రాన్ని నేననంటూ ఎవరికి వారు ప్రకటించుకున్నారు. రెండోది ఇసుక దందా. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పైగా ఇసుక దందా చేసేది ఎవరో.. తాండూరు ప్రజలకు...

Tandur MLA Vs MLC : తాండూరు తగదా..ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ, అసలు ఏమి జరిగింది ?

Tandur Trs

Patnam Mahender Reddy vs MLA Pilot Rohith Reddy : తాండూరు తగాదా పీక్స్‌కు చేరింది. ఒకేరోజు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరుస సమావేశాలతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. సీఐ విషయంలో జరిగిన ఓ వ్యవహారం.. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిగా మారిపోయింది. ఇది కాస్త వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే.. నాదేనన్న ప్రచారానికి తెర తీసింది. అంతేకాదు తాండూరులో ఇసుక దందా, కార్యకర్తల వేధింపులు, అధికారులకు అవమానాలంటూ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. మొదటగా తాండూరు టికెట్ పంచాయితీ సెగలు రేపుతోంది.

Read More : Tandur : రోడ్లు బాగు చేయించండి అంటూ టీఆర్ఎస్ కార్యకర్త పొర్లుదండాలు

గెలుపు గుర్రాన్ని నేననంటూ ఎవరికి వారు ప్రకటించుకున్నారు. రెండోది ఇసుక దందా. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పైగా ఇసుక దందా చేసేది ఎవరో.. తాండూరు ప్రజలకు తెలుసంటూ చెప్పుకొచ్చారు. ఇక మూడోది.. అసలు గొడవకు కారణమైంది మీరేనంటూ రెండు వర్గాలు ఆరోపించుకున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి రావడంతోనే అసలు గొడవకు కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఇక చివరిది.. సీఐ వ్యవహారం. ఓ పోలీస్ ఆఫీసర్‌ను దూషించిన ఘటనపై అధికార పార్టీ నేతల్లోనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా విచారణలో అసలు నిజం తేలుతుందంటూ చెప్పుకొచ్చారు.

Read More : Telangana : సీఐని దూషించిన ఆడియో నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పట్నం మహేందర్ రెడ్డి

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డికి మద్దతు తెలిపారు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీనే ప్రొటోకాల్‌ అయినా.. అది ఎమ్మెల్యే పాటించడం లేదని విమర్శించారు. మహేందర్‌రెడ్డికి అవమానం జరిగింది కాబట్టే తిట్టారన్నారు. అయితే మహేందర్‌ రెడ్డి తిట్టడాన్ని ఖండిస్తున్నానన్న ఆయన .. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తుంటే ఇంకేం చేస్తారన్నారు. అసలు ఎమ్మెల్యేకి ఐదు ఎస్కార్ట్‌లు అవసరమా.. అని ప్రశ్నించారు.