Haritha Haram : ఇంటింటికీ వెళ్లి, బొట్టు పెట్టి, మొక్క ఇచ్చి.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన

శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొలన్‌ సుష్మారెడ్డి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరిగి మహిళకు బొట్టు పెట్టారు.

Haritha Haram : ఇంటింటికీ వెళ్లి, బొట్టు పెట్టి, మొక్క ఇచ్చి.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన

Haritha Haram

haritha haram pattana pragathi trees planting : శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొలన్‌ సుష్మారెడ్డి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరిగి మహిళకు బొట్టు పెట్టారు. వారి చేతికి చెట్టు ఇచ్చారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన 6వ రోజు పట్టణప్రగతి కార్యక్రమంలో సుష్మారెడ్డి పాల్గొన్నారు. అందరూ పట్టణ ప్రగతికి తరలివచ్చారు. మేము సైతం అంటూ మొక్కలు నాటి నీరు పోశారు. మానవాళి మనుగడ, జీవకోటికి జీవనాధారం పచ్చదనంతో ముడిపడి ఉందని శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మా మహేందర్‌రెడ్డి తెలిపారు.

శంషాబాద్‌లో పట్టణప్రగతి సమీక్ష, చైతన్య సదస్సులో ఆమె మాట్లాడారు. పట్టణప్రగతి, హరితహారంలో శంషాబాద్‌ మున్సిపల్‌ను ఆదర్శంగా నిలుపాలని సూచించారు. అందుకు సమిష్టి కృషి చేయాల్సి ఉంటుందన్నారు. పక్కగా పారిశుధ్య నిర్వహణ జరుగాలని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ వహించాలన్నారు. కౌన్సిలర్లు, అధికారులు పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ పరిధిలో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

కాలనీల్లో పార్కులు ఉండటం వల్ల వృద్ధులు, చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. కపిలానగర్‌లో రూ. 20లక్షలతో ఏర్పాటు చేసిన పార్కులను ప్రారంభించారు. ప్రభుత్వం తమ ప్రాంతాలను అభివృద్ధి పరుచుకుకోవడంతో పాటు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పట్టణప్రగతిని ప్రవేశపెట్టిందన్నారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌లోని కాలనీల్లో పార్కుల అభివృద్ధికి అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.