జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు పట్ల బీజేపీపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 11:08 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు పట్ల బీజేపీపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan praise BJP : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం (డిసెంబర్ 5, 2020) మీడియాతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పులిలా పోరాడారని ప్రశంసించారు. బండి సంజయ్ నిజంగా టైగర్ సంజయ్ లా వ్యవహరించారని అభినందించారు.



జీహెచ్ఎంసీ ఫలితాలతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతుందన్నారు. సుస్థిరమైన హైదరాబాద్ కోసమే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ప్రచాంలో పాల్గొన్నదని చెప్పారు. జన సైనికులు కష్టపడి పని చేశారని తెలిపారు. తన మాట విని 60 డివిజన్లలో జన సైనికులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు.



జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. సీట్లు, ఓట్ల సంఖ్యలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ 48డివిజన్లలో విజయం సాధించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో 34 లక్షల 73వేల ఓట్లు పోలయ్యాయి. 56 డివిజన్లలో గెలిచిన టీఆర్ఎస్‌.. 74 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అటు బీజేపీ 48 డివిజన్లలో గెలిచి..72 చోట్ల రెండో స్థానంతో సరిపెట్టుకుంది.



టీఆర్‌ఎస్‌ కన్నా 7 డివిజన్లు తక్కువగా గెలుచుకున్నప్పటికీ.. మొత్తం ఓట్ల సంఖ్యా పరంగా చూస్తే బీజేపీకి కేవలం 0.25శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి.

టీఆర్‌ఎస్‌ సీట్ల పరంగా గ్రేటర్‌లో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా.. ఓట్ల విషయంలో మత్రం బీజేపీ గట్టి ఫైట్ ఇచ్చింది. ఈ రెండు పార్టీల ఓట్ల మధ్య తేడా కేలవం 8వేల 456 మాత్రమే. మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్‌కు 35.81 శాతం, బీజేపీకి 35.56 శాతం వచ్చాయి. రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం 0.25శాతం మాత్రమే.