CV Anand : శభాష్ సీపీ సీవీ ఆనంద్.. తప్పు చేస్తే తప్పించుడే.. కరప్ట్ ఆఫీసర్స్ వెన్నులో వణుకు పుట్టించిన పోలీస్ బాస్

హైదరాబాద్ పోలీస్ బాస్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. అరాచక సీఐని తప్పిస్తూ తీసుకున్న డెసిషన్ పోలీస్ శాఖను షేక్ చేస్తోంది. డిపార్ట్ మెంట్ లోని అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించింది.

CV Anand : శభాష్ సీపీ సీవీ ఆనంద్.. తప్పు చేస్తే తప్పించుడే.. కరప్ట్ ఆఫీసర్స్ వెన్నులో వణుకు పుట్టించిన పోలీస్ బాస్

CV Anand : హైదరాబాద్ పోలీస్ బాస్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. అరాచక సీఐని తప్పిస్తూ తీసుకున్న డెసిషన్ పోలీస్ శాఖను షేక్ చేస్తోంది. డిపార్ట్ మెంట్ లోని అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఏ మాత్రం గీత దాటినా ఎక్కడ వేటు పడుతుందోనని భయంతో వణికిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడితే ఇంతకుముందు సాగిందేమో కానీ, ఇక ముందు కుదరదంటున్నారు హైదరాబాద్ పోలీస్ బాస్.

వనస్థలిపురంలో ఓ మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించడంపై ప్రశంసలు వస్తున్నాయి. ఖాకీ డ్రెస్ వేసుకున్నాం కదా ఇక మనమేం చేసినా చెల్లుతుంది అనుకునే వారికి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో యాక్షన్ కు దిగారు సీవీ ఆనంద్.

తప్పు చేస్తే వణికించే పోలీసులే తప్పు చేస్తే ఊరుకునేది లేదన్నారు. మాటలతోనే కాదు చేతలతోనూ వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. సీపీగా చార్జ్ తీసుకున్న తర్వాత పోలీస్ బాస్ ఇప్పటివరకు 55 మందిపై చర్యలు తీసుకున్నారు. వాళ్లు వీళ్లు అని లేదు.. అటెండర్ నుంచి సీఐ వరకు ఎవరు తప్పు చేసినట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సీపీ ఇచ్చిన సంకేతాలతో చాలామంది పోలీస్ అధికారులు గీత దాటేందుకు వణికిపోతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సాధారణంగా సస్పెండ్ చేసి నేరం రుజువయ్యాక టెర్మినెట్ చేయడం జరుగుతోంది. కానీ, నాగేశ్వరరావు కేసులో ఆధారాలన్నీ వ్యతిరేకంగా ఉండటంతో పోలీస్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వివాహిత ఇంట్లోకి దూరి సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదిక సైతం నాగేశ్వరరావుకి వ్యతిరేకంగా వచ్చేలా ఉంది. సీసీ ఫుటేజీ, కారు ప్రమాద ఘటన, సర్వీస్ రివాల్వర్ రికార్డ్స్ సైతం నేరాన్ని రుజువు చేస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ అంతిమ దశకు చేరనుండటంతో డిపార్ట్ మెంట్ పరువు పోకుండా సీఐ నాగేశ్వర్ రావుని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సీవీ ఆనంద్.