LockDown: సార్.. వచ్చేనెల నా పెళ్లి అందుకే బయటకు వచ్చా

లాక్ డౌన్ లో బయటకు వచ్చిన వారు పోలీసులకు వింత కారణాలు చెబుతూ విసిగిస్తున్నారు.. పొంతనలేని కారణాలు చెబుతూ పోలీసులకు చిరాకు తెప్పిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తున్నామని కొందరు, పని ఉండి బయటకు వచ్చాను వెంటనే ఇంటికి వెళ్లిపోతానని ఇంకొందరు.. షాపు క్లోజ్ చేసి వస్తున్నాని మరికొందరు చెబుతున్నారు. వీరు చెబుతున్న చిల్లి కారణాలు అందరిని నవ్విస్తున్నాయి.

LockDown: సార్.. వచ్చేనెల నా పెళ్లి అందుకే బయటకు వచ్చా

Lockdown

LockDown: లాక్ డౌన్ లో బయటకు వచ్చిన వారు పోలీసులకు వింత కారణాలు చెబుతూ విసిగిస్తున్నారు.. పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాదానాలు చెబుతూ చిరాకు తెప్పిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తున్నామని కొందరు, పని ఉండి బయటకు వచ్చాను వెంటనే ఇంటికి వెళ్లిపోతానని ఇంకొందరు.. షాపు క్లోజ్ చేసి వస్తున్నాని మరికొందరు చెబుతున్నారు. వీరు చెబుతున్న చిల్లి కారణాలు పోలీసులకు కోపం తెప్పిస్తున్నాయి.

ఓ యువతిని పోలీసులు ఆపడంతో సార్ వచ్చే నెల 9 తేదీ పెళ్లి ఉంది.. బందువులకు కార్డులు పంచేందుకు వెళ్తున్న అంటూ చెప్పింది. అయితే ఇది సడలింపుకు ఆమోదయోగ్యమైనది కాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి తన నానమ్మ అపోలో ఆసుపత్రిలో ఉందని అక్కడికే వెళ్తున్నానని 2019 నాటి మెడికల్ చీటీ చూపించాడు. పోలీసులు అతడికి చివాట్లు పెట్టి కేసు నమోదు చేసి పంపారు.

ఇక మరోవ్యక్తి తన కుక్కకు బాగోలేదని దానిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని సమాధానం చెప్పాడు. అయితే ఆసుపత్రి అడ్రస్ అడిగారు పోలీసులు, సదరు వ్యక్తి తడబడటంతో మాయమాటలు చెప్పాడని కేసు నమోదు చేశారు.

మరోవ్యక్తి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చి తాను ఇప్పుడే షాప్ క్లోజ్ చేసి వస్తున్నాని సమాధానం చెప్పాడు. అయితే షాపులు 10 గంటలకే క్లోజ్ చెయ్యాలని నిబంధనల్లో ఉంది. ఇతడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇక కేసుల విషయంపై పోలీసులు మాట్లాడుతూ 100 మంది బయటకు వస్తే వారిలో 8 మంది ఎటువంటి పనిలేకుండా తిరగడానికి వస్తున్నారని చెబుతున్నారు.

వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. అటువంటి వారి వాహనాలను సీజ్ చేస్తున్నామని పోలీస్ అధికారులు వివరించారు. కాగా హైదరాబాద్ లో 300 లకు పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అయితే కొందరు మాత్రం లాక్ డౌన్ రూల్స్ అతిక్రమిస్తున్నారు.