Group 1 Prelims Exam : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని పిటిషన్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Group 1 Prelims Exam : అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్ లో.. ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. దీనిపై ఈ నెల 25న హైకోర్టు విచారించనుంది.

Group 1 Prelims Exam : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని పిటిషన్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Group 1 Prelims

Telangana High Court : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుండగా.. దాన్ని వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్ లో కోరారు. 36మంది అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్ లో.. ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. దీనిపై ఈ నెల 25న హైకోర్టు విచారించనుంది.

UPSC Result 2023 : సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి.. నారాయణపేట ఎస్పీ కూతురికి థర్డ్ ర్యాంక్

ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే టీఎస్ పీఎస్ సీ నిర్ణయించింది. అయితే, ఈ పరీక్షను దాదాపు 2 నెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. వీరి పిటిషన్ పై విచారణ జరిపేందుకు వెకేషన్ బెంచ్ కోర్టు అంగీకారం తెలిపింది. ఈ నెల 25న విచారణ జరుపుతామంది.

Also Read..Mahesh Bhagwat : సార్.. మీరు సూపర్.. మహేశ్‌ భగవత్‌ శిక్షణలో 125 మందికి సివిల్స్‌లో ర్యాంకులు

మరి ఆ రోజున కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక అభ్యర్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని పరీక్షను వాయిదా వేస్తుందా? అనేది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది. అసలు పరీక్ష వాయిదా వేయాలని కోరడానికి గల కారణాలను ఈ నెల 25న కోర్టుకి తెలుపనున్నారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.