Petro Effect : భారీగా ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్, బైక్ ట్యాక్సీలు!

ప్రముఖ సంస్థలైన జొమాటో, స్విగ్గీతో పాటు రవాణా సంస్థల్లో భాగమైన క్యాబ్స్ తమ ఛార్జీలను భారీగా పెంచేస్తున్నాయి. యాప్ ప్లాట్ ఫామ్స్ కూడా ఇప్పుడు రేట్ కార్డులను సవరిస్తున్నాయి.

Petro Effect : భారీగా ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్, బైక్ ట్యాక్సీలు!

Zomato

Hyderabad Food And Cab Services : ఫుడ్ డెలివరీలో ప్రముఖ సంస్థలైన జొమాటో, స్విగ్గీతో పాటు రవాణా సంస్థల్లో భాగమైన క్యాబ్స్ తమ ఛార్జీలను భారీగా పెంచేస్తున్నాయి. సింగిల్ ప్యాసింజర్ కు ఎంతో అనుకూలంగా ఉండే బైక్ ట్యాక్సీల ధరలకు కూడా రెక్కలొస్తున్నాయి. సర్ ఛార్జీల రూపంలో క్యాబ్ సంస్థలు మరింత భారం మోపుతున్నాయి. క్యాబ్ లు, బైక్ ల సేవలపై తాజాగా…15 శాతానికి పైగా ఛార్జీలను పెంచేశారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. దీనికంతటికీ కారణం..పెట్రో, డీజిల్ ధరలు పెరగడమే. సగటు జీవిని అతాకుతలం చేస్తున్నాయి. రోజుకు ఇంత ధర చొప్పున పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్ ఆధారంగా ఆహార పదార్థాలు, వివిధ రకాల వస్తువులు అందచేసే యాప్ ఆధారిత సేవలపై సైతం ఛార్జీలు పెరిగిపోయాయి.

Read More : Huzurabad : హుజూరాబాద్‌ లో జోరుగా ప్రలోభాల పర్వం.. ఒక్కో ఓటరుకు రూ. 6 వేలు

నిత్యావసర వస్తువులను, సేవలను అందచేసే యాప్ ప్లాట్ ఫామ్స్ కూడా ఇప్పుడు రేట్ కార్డులను సవరిస్తున్నాయి. బిర్యానీలు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ రవాణా సేవల రూపంలో మరికొంత అదనంగా బిల్లులు వేస్తున్నారు. పెట్రోల్ ఛార్జీల పెంపుతో సర్వీస్ ఛార్జీలు పెరిగాయని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. గతంలో ఒకటిన్నర కిలోమీటర్ దూరానికి రూ. 20 మాత్రమే సర్వీసు ఛార్జీ తీసుకుంటే…ఇప్పుడు కొన్ని యాప్ ప్లాట్ ఫామ్స్ రూ. 25 నుంచి రూ. 30 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Read More : Bahadurpura : నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి..బాలుడు ఆత్మహత్య

ఉదాహరణకు :-

హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి కొండాపూర్ వరకు గతంలో కేవలం రూ. 21 నుంచి రూ. 25 వరకు ఛార్జీలు వసూలు చేసేవారు. ఇప్పుడా సీన్ మారింది. రూ. 35 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఈ ఛార్జీల్లో తేడాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి హబ్సిగూడ వరకు గతంలో రూ. 30 వసూలు చేసే బైక్ ట్యాక్సీలు రూ. 50 పెంచేశారు. ఉప్పల్ నుంచి బంజారాహిల్స్ వరకు క్యాబ్ లో ప్రయాణించాలంటే…రూ. 275 ఉండేది. ఈ క్యాబ్ ఛార్జీ రూ. 350 దాటింది. దీంతో పాటు సర్ ఛార్జీల పేరిట క్యాబ్ సంస్థలు మరింత భారం మోపుతున్నాయి. పెట్రోల్ రేట్లు పెరగడంతో సొంత బండి పక్కన పెట్టి…బైక్ ట్యాక్సీలపై వెళ్లాలనుకొనే వారికి చుక్కలు కనబడుతున్నాయి. ప్రతి రోజు అంత ధర పెట్టడం తమ వళ్ల కావడం లేదని వాపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కూరగాయాలు, అన్ని రకాల కిరాణాల వస్తువులు, నిత్యావసర సరుకులు ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే..పెట్రో బాంబు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.