Girls Eye : షాకింగ్.. బాలిక కంట్లో నుంచి ప్లాస్టిక్, పేపర్, ఇనుప ముక్కలు.. ఎందుకిలా?

Plastic Pieces From Eye : 8ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, ఇనుప ముక్కలు, పుల్లలు వంటివి జారిపడుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Girls Eye : షాకింగ్.. బాలిక కంట్లో నుంచి ప్లాస్టిక్, పేపర్, ఇనుప ముక్కలు.. ఎందుకిలా?

Girls Eye

Plastic Pieces From Eye : కంట్లో చిన్న నలుసు పడితేనే బాధపడతాం. అలాంటిది ఓ పాప కంటి నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు, పుల్లలు బయటకు వస్తున్నాయి. దాంతో ఆ బాలిక అవస్థ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురంకు చెందిన భూక్యా సౌజన్య ఒకటవ తరగతి చదువుతోంది.

గత నెల రోజులుగా 8ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, ఇనుప ముక్కలు, పుల్లలు వంటివి జారిపడుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత నాలుగు రోజులు బాగానే ఉంది. మళ్లీ యధావిధిగా కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, పుల్లలు బయటకు వస్తున్నాయి. దీంతో పాపను తల్లిదండ్రులు ఖమ్మం జిల్లాలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Also Read..Lose Weight : బరువు తగ్గడానికి కాఫీ ఎలా తాగాలి? బ్లాక్ కాఫీ మంచిదా.. మిల్క్ కాఫీ మంచిదా?

పాపను పరీక్షించిన డాక్టర్లు సైతం విస్తుపోతున్నారు. ఎవరైనా చెబితే వినటమే తప్ప ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలను ప్రత్యక్షంగా చూడలేదని డాక్టర్లు అంటున్నారు. పాప కన్ను బాగానే ఉందని, ఎలాంటి గాయం కాలేదని చెప్పారు. కళ్ల నుంచి అలాంటి వస్తువులు ఉత్పత్తి కావన్నారు. ఆ వస్తువులను ఎవరైనా పాప కళ్లలో పెట్టాలి. లేదా పాపనే తన కళ్లలో ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. పాపను అబ్జర్వేషన్ లో ఉంచారు డాక్టర్లు.

సౌజన్య (8) చిన్నప్పటి నుండే అమ్మమ్మ ఊరు గార్లమండల పెద్దకిష్టాపురంలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. చిన్నప్పటి నుండి బాగానే ఉంది. సడెన్ గా.. 3 నెలల క్రితం సౌజన్య కంటి నుంచి ఓ పత్తిగింజ బయటపడింది. దాంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటి నుండి సౌజన్య ఆరోగ్యం బాగానే ఉంది.

అయితే, కొన్ని రోజులకు మళ్లీ ప్లాస్టిక్, పేపర్ ముక్కలు కంటి నుంచి జారిపడుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు మళ్లీ కంగారుపడుతున్నారు. కంటి నుంచి వ్యర్ధాలు వస్తున్న విషయం తెలిసి స్థానికులు అవాక్కయ్యారు. ఇదేదో వింతగా ఉందంటున్నారు. కంటి నుంచి వింత వస్తువులు వస్తుండటంతో తల్లిదండ్రులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. తమ పాపకు ఏమైందోనని బెంగ పెట్టుకున్నారు. తమది నిరుపేద కుటుంబం అని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Also Read..climate update: ఇవేం ఎండలు రా బాబూ.. మే నెల ముగిసినా ఎండలు తగ్గవట!

పాపను అబ్జర్వేషన్ లో ఉంచిన డాక్టర్లు.. దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? కంటి నుంచి వ్యర్థాలు ఎలా వస్తున్నాయి? దీనికి కారణం ఏంటి? ఈ మిస్టరీ వీడాల్సి ఉంది.