రుణాలు చెల్లించేందుకు అంగీకరించండి…కేసులు మూసేయండి

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 07:07 AM IST
రుణాలు చెల్లించేందుకు అంగీకరించండి…కేసులు మూసేయండి

భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న వేలకోట్ల రూపాయలను 100శాతం చెల్లించేందుకు తానే సిద్దమేనని మరోసారి తెలిపారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. ప్రస్తుతం లండన్ లో ఉంటూ తనను భారత్ కు అప్పగించవద్దంటూ బ్రిటన్ కోర్టుల్లో పిటిషన్ లు వేస్తున్న విజయ్ మాల్యా…తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 100శాతం చెల్లిస్తానని,తన ఆఫర్ ను భారత ప్రభుత్వం అంగీకరించి తనపై చేసిన మనీలాండరింగ్,మోసం వంటి కేసులను మూసివేయాలని కోరారు. కరోనా రిలీఫ్ కింద 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన భారత ప్రభుత్వాన్నిమాల్యా అభినందించారు.

కొవిడ్ -19 రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించిన భారత ప్రభుత్వానికి అభినందనలు. వారు కోరుకున్నంత కరెన్సీని ముద్రించవచ్చు, కాని ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులకు రుణాలను 100శాతం తిరిగి చెల్లిస్తానని ఆఫర్ చేస్తున్న నా లాంటి చిన్న సహకారిని ప్రభుత్వం తరచూ విస్మరించాలా? అని లిక్కర్ కింగ్ ట్వీట్ చేశారు. 

భారతీయ బ్యాంకుల9వేలకు కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారు మాల్యా గతంలో కూడా పలుసార్లు తాను తీసుకున్న రుణాలను చెల్లించేందుకు సిద్దమేనని,అటాచ్ చేసిన తన ఆస్తులను రిలీజ్ చేసి అమ్ముకోవడానికి వీలు కల్పిస్తే వాటిని అమ్మి రుణాలను తీర్చుతానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనను భారత్ కు అప్పగించే ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ లండన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేయడంతో ఈ నెల ప్రారంభంలో యూకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Read Here>>  endemic గా మారనున్న కరోనా మహమ్మారి…WHO కీలక వ్యాఖ్యలు