Telangana : తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేటాయించింది. పీఎం మిత్రా మెగా టెక్స్ టైల్ పార్కును ఏడు రాష్ట్రాల్లోనూ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణకు కూడా ఒకటి కేటాయించింది.

Telangana : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేటాయించింది. పీఎం మిత్రా మెగా టెక్స్ టైల్ పార్కును ఏడు రాష్ట్రాల్లోనూ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణకు కూడా ఒకటి కేటాయించింది. ఏ ఏ రాష్ట్రాల్లో మెగా టెక్స్ టైల్ పార్క్ ను నెలకొల్పుతున్నారో వాటితో రైతులు, చేనేత కార్మికులకు కలిగే లబ్ధి ఎలాంటిదో తెలియజేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మెగా టెక్స్ టైల్ పార్క్ తో లక్షలాది మంది రైతులు, చేనేత కార్మికులకు మేలు జరుగుతుంది. వేలాది మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్స్ టైల్ రంగంలో భారత్ ను ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అపారల్ పార్క్ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Telangana Government : 15 కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టులకు తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయనుంది. మెగా టెక్స్ టైల్ పార్కులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తరపున కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు