కోవిడ్-19పరిస్థితిపై బిల్ గేట్స్ తో మాట్లాడిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 15, 2020 / 05:19 AM IST
కోవిడ్-19పరిస్థితిపై బిల్ గేట్స్ తో మాట్లాడిన మోడీ

కోవిడ్-19 పరిస్థితి,వైరస్ కు వ్యాక్సిన్ విషయమై మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్‌తో భారత ప్ర‌ధాని మోడీ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. గురువారం రాత్రి సుమారు అర‌గంట పాటు బిల్ గేట్స్‌తో మోడీ మాట్లాడారు. కరోనా కారణంగా ఏర్ప‌డ‌బోయే జీవన‌విధానాల్లో  మార్పులు, ఆర్థిక పరిష్కారాలు, సామాజిక ప‌రివ‌ర్త‌న‌, విద్యా, ఆరోగ్య సేవ‌లు గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని గేట్స్‌ను మోడీ కోరారు.

టెక్నాల‌జీ స‌వాళ్ల‌ను కూడా ఎలా ఎదుర్కోవాలో చెప్పాల‌న్నారు. క‌రోనాపై పోరాటంలో భార‌త్ అనుస‌రించిన విధానాన్ని బిల్ గేట్స్‌కు మోడీ వ‌ిరించారు. మ‌హ‌మ్మారిని ఎదుర్కోవడానికి గ‌తంలో త‌మ ప్ర‌భుత్వాలు చేపట్టిన అనేక స్కీమ్‌లు ప్ర‌జ‌ల‌కు ఉప‌క‌రించిన‌ట్లు తెలిపారు. స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ తో పారిశుద్ధ్యం పెరిగింద‌న్నారు. ప్ర‌జ‌ల ఇమ్యూనిటీని పెంచేందుకు ఆయుర్వేద విశిష్టాన్ని తెలిపామ‌న్నారు. ఇలాంటి వాటి వ‌ల్ల భార‌త ప్ర‌జ‌లు మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోగ‌లిగార‌ని గేట్స్‌ కి మోడీ తెలిపారు.

వైద్య బృందాల‌ను గౌర‌వించ‌డం, మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం, పారిశుద్ధ్యం పాటించ‌డం లాంటి విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌ను ఆక‌ళింపు చేసుకున్న‌ట్లు మోడీ తెలిపారు. భార‌త ప్ర‌భుత్వం డెవల‌‌ప్ చేసిన మొబైల్ యాప్‌తో స‌మ‌ర్థ‌వంగా రోగులను ట్రేస్ చేశామ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ స‌ర్వీసుల గురించి ఇద్ద‌రూ విస్తృతంగా చ‌ర్చించారు. ప్ర‌పంచ శ్రేయ‌స్సు కోసం భార‌త సామ‌ర్థ్యాన్ని, అవ‌కాశాల‌ను వాడుకునేందుకు స‌ల‌హాలు ఇవ్వాలంటూ గేట్స్‌ను మోడీ కోరారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి శాస్త్రీయ ఆవిష్కరణ మరియు పరిశోధనలలో ప్రపంచదేశాల సమన్వయం యొక్క ప్రాముఖ్యత గురించి మోడీ-బిల్ గేట్స్ చ‌ర్చించారు. భార‌త్‌తో పాటు అనేక దేశాల్లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేష‌న్ చేప‌డుతున్న అనేక ఆరోగ్య కార్య‌క్ర‌మాల‌ను మోడీ మెచ్చుకున్నారు. కోవిడ్‌19 నివార‌ణ‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గేట్స్ ఫౌండేష‌న్ చురుగ్గా స్పందించింద‌న్నారు. 

Read Here>> వలసదారులకు సామూహిక కరోనా పరీక్షలు, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు