PM Modi Hyderabad Tour : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన విజయవంతం

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అంతకముందు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

PM Modi Hyderabad Tour : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన విజయవంతం

PM Modi Hyderabad Tour (2)

PM Modi Hyderabad Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రధాని తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట్ నుంచి చెన్నై వెళ్లనున్నారు. అంతకముందు సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడవనున్న వందే భారత్ రైల్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆయన ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 08 Apr 2023 01:43 PM (IST)

    బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన విజయంతంగా ముగిసింది. తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని బేగంపేట నుంచి చెన్నై వెళ్లనున్నారు.

  • 08 Apr 2023 01:40 PM (IST)

    ముగిసిన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన

    ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. సికింద్రాబా రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ సభలో ఆయన ప్రసంగించారు.

  • 08 Apr 2023 01:34 PM (IST)

    తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందన్న ప్రధాని మోదీ

    తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. అన్ని పార్టీలను చేతిలో పెట్టుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం అన్నారు. నిజాయితీగా పని చేసేవారు వారికి గిట్టరని పేర్కొన్నారు.

  • 08 Apr 2023 01:27 PM (IST)

    కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదు : ప్రధాని మోదీ

    కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని.. దీంతో తెలంగాణ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • 08 Apr 2023 01:20 PM (IST)

    తెలంగాణలో 9 ఏళ్లలో అనేక రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి : ప్రధాని మోదీ

    తెలంగాణలో 9 ఏళ్లలో అనేక రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. రైల్వేలతోపాటు జాతీయ రహదారులకు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. కల్వకుర్తి-కొల్లాపూర్ జాతీయ రహదారి, మహబూబ్ నగర్-చెంచోరీ రహదారి, తెలంగాణలో రహదారులకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

  • 08 Apr 2023 01:06 PM (IST)

    తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే మహత్తర అవకాశం లభించింది : ప్రధాని మోదీ

    తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే మహత్తర అవకాశం తనకు లభించిందని ప్రధాని మోదీ అన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయం ఉన్న నగరానికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కలిపే ట్రైన్ ను ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వికాసానికి కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతగా భావిస్తుందన్నారు. అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు తాము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో 70 కిలో మీటర్లకు పైగా మెట్రో కారిడార్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కొత్తగా 13 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను ప్రారంభించామని తెలిపారు. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

  • 08 Apr 2023 12:59 PM (IST)

    పరేడ్ గ్రౌండ్ సభలో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధాన మోదీ

    పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాన మోదీ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

  • 08 Apr 2023 12:57 PM (IST)

    పరేడ్ గ్రౌండ్ సభా వేదిక నుంచే వర్చువల్ గా అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ

    సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభ జరుగోంది. సభా వేదిక నుంచే ప్రధాని మోదీ వర్చువల్ గా అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించారు. రూ.11 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. రూ.1365.95 కోట్లతో ఎయిమ్స్ 750 పడకల ఆస్పత్రి.

  • 08 Apr 2023 12:47 PM (IST)

    రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు : కిషన్ రెడ్డి

    తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 2 వందే భారత్ రైళ్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.7,864 కోట్లతో జాతీయ రహదారులకు భూమి పూజ చేసినట్లు చెప్పారు.

  • 08 Apr 2023 12:41 PM (IST)

    బీబీనగర్ ఎయిమ్స్ కు మహర్దశ : కిషన్ రెడ్డి

    13 ఎంఎంటీఎస్ లను ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ కు మహర్దశ కలిగిందన్నారు.

  • 08 Apr 2023 12:36 PM (IST)

    రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతోనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు నిలిచిపోయాయి : కిషన్ రెడ్డి

    రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతోనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు నిలిచిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే ఎంఎంటీఎస్ రెండో దశ పనుల విస్తరణ చేపట్టమని చెప్పారు.

  • 08 Apr 2023 12:30 PM (IST)

    పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    పరేడ్ గ్రౌండ్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు.

  • 08 Apr 2023 12:06 PM (IST)

    సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందే భారత్ రైల్ తో పాటు .. జంట నగరాల మధ్య తిరిగే ఎంఎంటియస్ రైల్ సర్వీసును రెండు ఓకేసారి ప్రారంభించిన ప్రధాని మోదీ.

  • 08 Apr 2023 12:00 PM (IST)

    బండి సంజయ్ చొరవతో బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిసేందుకు ప్రధాని అనుమతి

    బండి సంజయ్ చొరవతో బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిసేందుకు ప్రధాని అనుమతి

    స్వీపర్ సహా ఆఫీస్ లో పనిచేసే 40 మంది సిబ్బంది మరి కొద్ది నిమిషాల్లో మోదీని కలవబోతున్నారు.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్ద మోదీని కలవనున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది

    రైల్వే స్టేషన్ కు చేరుకున్న మోదీ... మోదీ మోదీ నినాదలతో మారుమోగుతున్న రైల్వే స్టేషన్

  • 08 Apr 2023 11:58 AM (IST)

    పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియాఫై పోలీసులు జులుం...

    పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియాఫై పోలీసులు జులుం...

    మోదీ పర్యటన కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్న ఏసీపీ రమేష్...

    మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ..

    పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు..

    పరేడ్ గ్రౌండ్ బయట మీడియాకు అనుమతి లేదంటున్న పోలీసులు..

  • 08 Apr 2023 11:54 AM (IST)

    ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన రైల్వే ఉన్నతాధికారులు

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.

  • 08 Apr 2023 11:50 AM (IST)

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కుచేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.

  • 08 Apr 2023 11:48 AM (IST)

    కాసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధాని మోదీ

    కాసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధాని మోదీ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ప్రారంభించన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.

  • 08 Apr 2023 11:42 AM (IST)

    ప్రధాని మోదీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరం

    ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రధానమంత్రి పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

  • 08 Apr 2023 11:40 AM (IST)

    ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    బేగంపేట్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు.

  • 08 Apr 2023 11:37 AM (IST)

    బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.షెడ్యూల్డ్ టైంకు పదినిమిషాల ముందే చేరుకున్నారు.

  • 08 Apr 2023 11:20 AM (IST)

    సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో 8,9,10 ప్లాట్ ఫారాలపై రైళ్ల రాకపోకలు నిలిపివేత

    సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లోని 8,9,10 ప్లాట్ ఫారాలపై మధ్యాహ్నం వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. స్టేషన్ కు ఇరువైపుల రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా కేవలం ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ వైపే ప్రయాణికులు అనుమతించనున్నారు. పాదాచారుల వంతెనలపై ఏడో నెంబర్ ప్లామ్ ఫామ్ వరకే అనుమతిస్తారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ స్థానిక పోలీసులతో కలిసి అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ లైజనింగ్ నిర్వహించింది. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో కాన్వాయ్ తో రిహార్సల్స్ నిర్వహించారు.

  • 08 Apr 2023 11:18 AM (IST)

    బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు ప్రధాని చేరుకోనున్నారు.

  • 08 Apr 2023 11:16 AM (IST)

    సుమారు 2 వేల మందితో పోలీసు బందోబస్తు

    ప్రధాని మోదీ సభ నిర్వహించే పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వందకు పైగా సీసీ కెమెరాలను బిగించారు. ప్రధాని, ఇతర ప్రముఖుల రాకపోకలు సాగించేలా మైదానంలో తీర్పు ద్వారంతోపాటు పక్కనే మరో ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు మార్గాల్లో పహారాలో నిమగ్నమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి పరేడ్ మైదానం మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఉన్న మార్గాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం ప్రధాని పర్యటన ముగిసే వరకు మూసివేయనున్నారు.

  • 08 Apr 2023 11:13 AM (IST)

    పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

    సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాన వేదికతోపాటు దానికి ఎదురుగా మూడు జర్మన్ షెడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరో షెడ్డును సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాన్ని స్పష్టంగా తిలకించేందుకు ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. జనం ఉక్కపోతతో ఇబ్బంది పడకుండా షవర్ ఏసీలు, కూలర్లను కూడా ఏర్పాటు చేశారు.

  • 08 Apr 2023 11:07 AM (IST)

    బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న గవర్నర్ తమిళిసై

    బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న గవర్నర్ తమిళిసై
    ఇప్పటికే చేరుకున్న తలసాని

  • 08 Apr 2023 11:06 AM (IST)

    ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. తర్వాత 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్ మైదానానికి చేరుకుంటారు. ఈ వేదికపై నుంచే పలు జాతీయ రహదారుల పనులకు బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు.

  • 08 Apr 2023 10:26 AM (IST)

    పోలీస్ నిఘా నీడలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్..

    పోలీస్ నిఘా నీడలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్..

    బీజేపి ముఖ్యనేతలకు మాత్రమే లోపలికి అనుమతి

    ఉదయం 11:30 కు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ

    రోడ్డుమార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లనున్న ప్రధాని

    అనంతరం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొనున్న మోదీ

    షెడ్యూల్డ్ ప్రకారం మధ్యాహ్నం 1:30 తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్న ప్రధాని

  • 08 Apr 2023 10:23 AM (IST)

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్న భద్రతా బలగాలు

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్న భద్రతా బలగాలు
    తెలంగాణ పోలీసులతో పాటు , రైల్వే పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల పహారా
    ప్లాట్ ఫామ్ టిక్కెట్లను సైతం నిలిపేసిన రైల్వే అధికారులు
    ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపుతున్న అధికారులు
    ప్రయాణికులను స్టేషన్ లోకి వెళ్లే మార్గం లో రెండు, మూడు చోట్ల తనిఖీ లు
    కాసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

  • 08 Apr 2023 09:46 AM (IST)

    సింగరేణి బొగ్గు గనుల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహాధర్నా

    సింగరేణి బొగ్గు గనుల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నాకు సిద్ధమయ్యారు. కాసేపట్లో గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేయనున్నారు. బీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాలు నేతలు, కార్మికులు ధర్నాలో పాల్గొంటారు. ‘మోదీ హటావో సింగరేణి బచావో’ నినాదంతో బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది.

  • 08 Apr 2023 09:45 AM (IST)

    ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ముందస్తు అరెస్ట్

    ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయినా బండి సంజయ్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి పర్యటను అడ్డుకుంటామని నిన్న ప్రకటన చేయడంతో బలమూరి వెంకట్ ను ముందస్తు అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిని గృహ నిర్బంధించారు.

  • 08 Apr 2023 09:43 AM (IST)

    ప్రధాని అభివృద్ధి పనుల వివరాలు.‌..

    శంకు స్థాపన చేసేవి
    మొత్తం 11 వేల కోట్ల అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం
    1365.95 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ 750 పడకల హాస్పటల్ కి శంకుస్థాపన
    తెలంగాణలోని 410 కిలోమీటర్ల జాతీయ రహదారులు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
    720 కోట్ల సికింద్రాబాద్ రైల్వే అభివృద్ది పనులకు శంకుస్థాపన

    ప్రారంభించేవి..
    సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు
    1410 కోట్లతో పూర్తయిన సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబుల్ లైన్ , విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం
    సికింద్రాబాద్ - మేడ్చల్, ఫలక్ నామ - ఉందానగర్ రూట్లలో 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభం
    మొదటి దశలో 44 కిలోమీటర్ల మార్గం వరకు ఎంఎంటీఎస్, రెండవ దశలో 51 కిలోమీటర్లు అందుబాటులోకి రానున్నాయి.