Kavitha slams Modi: 9 ఏళ్లలో మోదీ ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు: కల్వకుంట్ల కవిత

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ పటాన్ చెరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని హోదాలో మోదీ ఒక్క మీడియా సమావేశంలోనూ సమాధానాలు చెప్పలేకపోవడం మన దురదృష్టకరమని చెప్పారు. ఇప్పటివరకు ప్రధాని మోదీని జర్నలిస్టులు ఒక్క ప్రశ్న కూడా అడిగే అవకాశం రాలేదని అన్నారు.

Kavitha slams Modi: 9 ఏళ్లలో మోదీ ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు: కల్వకుంట్ల కవిత

Kavitha slams Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ పటాన్ చెరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధాని హోదాలో మోదీ ఒక్క మీడియా సమావేశంలోనూ సమాధానాలు చెప్పలేకపోవడం మన దురదృష్టకరమని చెప్పారు. ఇప్పటివరకు ప్రధాని మోదీని జర్నలిస్టులు ఒక్క ప్రశ్న కూడా అడిగే అవకాశం రాలేదని అన్నారు.

ఎంపిక చేసిన కొందరు జర్నలిస్టులతోనే మోదీ మాట్లాడతారని చెప్పారు. కానీ, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దాదాపు 300 మంది జర్నలిస్టులతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వారికి సమాధానాలు ఇస్తుంటారని తెలిపారు. నాయకుడు అంటే పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని కవిత చెప్పుకొచ్చారు. తమలాంటి నాయకులు ఏవైనా ప్రశ్నలు అడిగితే అది రాజకీయంగా చిత్రీకరిస్తారని, కానీ జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నలు అడుగుతారని చెప్పారు.

తమ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తోందని కవిత అన్నారు. గుర్తింపులేని కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేదని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కాలంగా అంటోంది.

Varun Gandhi: బీజేపీకి టాటా.. తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వరుణ్ గాంధీ?