Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ

బండి సంజయ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉంది, కాళ్ల నొప్పులు తగ్గాయా అని బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు.(Modi Praises Bandi Sanjay)

Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ

Modi Praises Bandi Sanjay

Modi Praises Bandi Sanjay : ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అభినందించారు. శభాష్ సంజయ్ అంటూ ఆయన భుజంతట్టారు ప్రధాని మోదీ. బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించిన మోదీ.. బండి సంజయ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ బండి సంజయ్ ను స్వయంగా అడిగారు. కాళ్ల నొప్పులు తగ్గాయా అని బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు మోదీ. కాగా, ఈ నెల 14న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు బండి సంజయ్. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 320 కిలోమీటర్లు నడిచారు బండి సంజయ్. దీంతో బండి సంజయ్ పట్టుదలను ప్రధాని మోదీ ప్రశంసించారు.

ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.(Modi Praises Bandi Sanjay)

Bandi Sanjay: తెలంగాణలోమసీదులు తవ్వుదామా? శవాలు ఉంటే మీరు తీస్కోండీ..శివలింగాలుంటే మాకు ఇవ్వండి : ఓవైసీకి బండి సంజయ్ సవాల్

తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పట్టుదల, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం, మీ ప్రేమాభిమానాలే నా బలం అంటూ మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు అని ప్రధాని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ పోరాటం జరగలేదన్నారు.

అయితే, ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ పార్టీ స్వలాభం ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. పేదల సమస్యలు ఆ కుటుంబ పార్టీకి పట్టవని విమర్శించారు. తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరడంలేదని, యువత ఆకాంక్షలను సర్కారు పట్టించుకోవడంలేదని ప్రధాని అన్నారు. కుటుంబ దోపిడీకి తెలంగాణ బలవుతోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, తెలంగాణలో మార్పు తథ్యమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టిస్తామని, జెండా ఎగరేస్తామని విశ్వాసం వెలిబుచ్చారు. టీఆర్ఎస్ జూట్ నే వాలే… బీజేపీ జీత్ నే వాలే అంటూ నినదించారు. తెలంగాణను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనేది తమ ఆకాంక్ష అని వెల్లడించారు. తమ పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసమని మోదీ ఉద్ఘాటించారు.

PM MODI: తెలంగాణలో మార్పు తథ్యం.. అధికారంలోకి వచ్చేది బీజేపీనే

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ.. వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అందులో భాగమే. ఇప్పటికే రెండు సంగ్రామ యాత్రలు కంప్లీట్ చేశారు బండి సంజయ్. దీంతో తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటూ తమ బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు.

ఇది ఇలా ఉంటే.. జూన్ 23 నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభించాలని బండి సంజయ్ భావిస్తున్నారు. జూలై 12 వరకు బండి సంజయ్‌ యాత్ర సాగనుందని తెలుస్తోంది. ఆగస్టు చివరి లోపు 4వ విడత సైతం పూర్తి చేయాలని బీజేపీ నేతలు ప్రణాళిక రచించారు. మూడు, నాలుగో విడత పాదయాత్రలు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరగనుందని సమాచారం. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు.(Modi Praises Bandi Sanjay)

కాగా, బండి సంజయ్ పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. మూడు, నాలుగు విడత పాదయాత్రల షెడ్యూల్‌ ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి, రెండో విడత పాదయాత్రలు 67 రోజులపాటు సాగింది. 828 కిలోమీటర్ల మేర జరిగిన యాత్రలో.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం దాదాపు 11 లక్షల మంది పాదయాత్రలో పాల్గొన్నారని బీజేపీ నేతలు వెల్లడించారు.

మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై దృష్టి సారించింది. పార్టీ బలోపేతానికి అగ్రనేత అమిత్ షా వీలైనన్ని సార్లు రాష్ట్రానికి వస్తున్నారు. తన ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతనోత్సహం నింపుతున్నారు.