Modi in Hyderabad: ప్ర‌ధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు | PM Modi visit to Hyderabad complete schedule, BJP state wing to Honor PM at Airport

Modi in Hyderabad: ప్ర‌ధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు

ప్రధాని రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతనుత్తేజాలు రేకిత్తించింది. దీంతో మోదీకి ఘన స్వాగ‌తం ప‌లికేందుకు బేగంపేట ఏయిర్ పోర్టు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు

Modi in Hyderabad: ప్ర‌ధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు

Modi in Hyderabad: హైదరాబాద్‌లోని ఇండియా స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన ఖరారు కాగా ఆమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మ‌ధ్య‌హ్నం 1.25 గంట‌ల‌కు బేగంపేట ఏయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని. తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ప్రధాని రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతనుత్తేజాలు రేకిత్తించింది. దీంతో మోదీకి ఘన స్వాగ‌తం ప‌లికేందుకు బేగంపేట ఏయిర్ పోర్టు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు. బేగంపేట ఏయిర్ పోర్టులోనే ప్ర‌ధాని మోదీకి పౌర‌స‌న్మానం ఏర్పాటు చేశారు.

other stories:Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్

ఏయిర్ పోర్ట్ లాంజ్‌లో మోదీకి స్వాగ‌త ఏర్పాట్లు చేయగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఇతర‌ బీజేపీ సీనియ‌ర్ నేత‌లు స్వాగ‌తం ప‌ల‌కనున్నారు. అనంతరం 2 గంట‌ల‌కు ఐఎస్‌బీ ప్రాంగణానికి చేరుకోనున్న ప్ర‌ధాని మోదీ..2.10 గంట‌ల‌కు ఐఎస్‌బీ స్నాత‌కోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ప్రధాని మోదీతో పాటు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి , రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్, ఐఎస్‌బీ డీన్, ఐఎస్‌బీ చైర్మ‌న్‌లతో పాటు ప్రొఫెస‌ర్లు వేదిక‌పై ఆసీనులు కానున్నారు. గంటా ప‌దిహేను నిమిషాల పాటు స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మం కొనసాగనుంది. మార్గమధ్యలో ప్రధాని మోదీని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు, ఇతర అధికారులు ప్ర‌త్యేకంగా క‌లిసేలా ఆరుచోట్ల ఏర్పాట్లు చేశారు.

other stories:BJP leader Laxman: ప్రధాని ముందు ముఖం చెల్లకనే కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నడు

హైద‌రాబాద్ సెంట‌ర్ యూనివ‌ర్సిటీలో జిల్లా అధ్య‌క్షులు ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికి విడ్కోలు ప‌లుక‌నున్నారు. ఈపర్యటంలో భాగంగా జీహెచ్ఎంసీ కార్పోరేట‌ర్ల‌ను మోదీ ఐఎస్‌బీ ప్రాంగణంలో ప్రత్యేకంగా కలవనున్నారు. ఇక సాయంత్రం నాలుగంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్ర‌యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు న‌రేంద్ర మోదీకి సెండాఫ్ ఇవ్వ‌నున్నారు. మరోవైపు ప్ర‌ధాని మోదీ హైదరాబాద్ టూర్ తెలంగాణ‌లో రాజ‌కీయాల్లో కాక రేపుతోంది. ప్రధాని అధికారిక ప‌ర్య‌ట‌న‌ను రాష్ట్ర బీజేపీ అధిష్టానం పార్టీ కేడ‌ర్‌లో ఉత్సాహం నింపేందుకు వినియోగించుకుంటుంది.

other stories:PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్‌ చెక్కపెట్టె’ గురించి తెలుసా

ప్ర‌ధానిని ఫేస్ చేయ‌లేక‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కర్ణాటక వెళ్తున్నాడ‌ని బీజేపీ నేత‌ల విమ‌ర్శిస్తుండగా తెలంగాణ‌పై వివ‌క్ష చూపిస్తూ ఏ మోహం పెట్టుకుని ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌కు వ‌స్తుండో చెప్పాలంటూ టీఆర్ఎస్ నేత‌లు విమరిస్తున్నారు. గ‌త 20 రోజుల్లో ముగ్గురు బీజేపీ అగ్ర‌నేత‌లు రాష్ట్రానికి వచ్చారు. మే 5న మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో జరిగిన బహిరంగ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా హాజరు కాగా..14వ తేదీన రంగారెడ్డి జిల్లాలో నిర్వ‌హించిన సంగ్రామ యాత్ర ముగింపు స‌భ‌కు అమిత్ షా వచ్చారు. గురువారం ప్ర‌ధాని మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

×