Vande Bharat PM Modi : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు.

Vande Bharat PM Modi : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Vande Bharat PM Modi (1)

Vande Bharat PM Modi : అధికార పక్ష బీఆర్ఎస్ కు, విపక్ష బీజేపీ మధ్య తెలంగాణలో హోరాహోరీ మాటల యుద్ధం నడుస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం(ఏప్రిల్8,2023)హైదరాబాద్ కు వస్తున్నారు. సుమారు రెండు గంటలపాటు నగరంలో పర్యటించనున్న ప్రధాని రూ.11 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వాస్తవంగా ఈ కార్యక్రమాలు జనవరిలోనే జరగాల్సివుండగా వాయిదా పడుతూ వచ్చాయి. ప్రధాని కార్యక్రమాల్లో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు.

బహిరంగ సభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కూడా షెడ్యూల్ లో చేర్చారు. అయితే ప్రధానికి బేగంటపేట్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు పార్టీల మధ్య వాగ్వివాదాలు, ఇటీవల పరిణామాలు, పోటా పోటీ కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కెంది. పదో తరగతి ప్రశ్నాపత్రాలతో లీకేజీ కేసులో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, విడుదల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పరంపర కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ తాజాగా ప్రధాని పర్యటన రోజునే ఆందోళనలకు పిలుపు ఇచ్చింది.

Vande Bharat Train: సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రయత్నింస్తోందని ఆరోపిస్తూ ఇవాళ బొగ్గు గనుల వద్ద మహా ధర్నాలు చేపడుతోంది. ప్రధాని పర్యటన అధికారికమైనా… బీజేపీ నాయకులు దీన్ని విజయవంతం చేయడంపై పూర్తిగా దృష్టి సారించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర పార్టీ ఇన్ చార్జ్ లు, ఇతర ముఖ్యనేతలతో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శాసన సభ ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ ఇకపై ప్రతి నెల రాష్ట్రానికి వస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

ఇది మొదటి కార్యక్రమంగా పేర్కొన్న ఆ పార్టీ బహిరంగ సభను విజయంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.  సభకు చుట్టు పక్కల జిల్లాల నుంచి జనాలను సమీకరిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు.
అనంతరం అందులో కొందరు విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తారు. అంతకముందు ప్రధాని వారితో ముచ్చటిస్తారు.

Secunderabad : రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ

తర్వాత 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్ మైదానానికి చేరుకుంటారు. ఈ వేదికపై నుంచే పలు జాతీయ రహదారుల పనులకు బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తైన సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ రైలును జాతికి అంకితం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాన వేదికతోపాటు దానికి ఎదురుగా మూడు జర్మన్ షెడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరో షెడ్డును సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాన్ని స్పష్టంగా తిలకించేందుకు ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. జనం ఉక్కపోతతో ఇబ్బంది పడకుండా షవర్ ఏసీలు, కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో వందకు పైగా సీసీ కెమెరాలను బిగించారు. ప్రధాని, ఇతర ప్రముఖుల రాకపోకలు సాగించేలా మైదానంలో తీర్పు ద్వారంతోపాటు పక్కనే మరో ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Vande Bharat Express: ఆదివారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో.. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు టైమింగ్స్ ఇవే..

సుమారు రెండు వేల మంది పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు మార్గాల్లో సహారాలో నిమగ్నమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి పరేడ్ మైదానం మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఉన్న మార్గాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం ప్రధాని పర్యటన ముగిసే వరకు మూసివేయనున్నారు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లోని 8,9,10 ప్లాట్ ఫారాలపై మధ్యాహ్నం వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

స్టేషన్ కు ఇరువైపుల రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా కేవలం ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ వైపే ప్రయాణికులు అనుమతించనున్నారు. పాదాచారుల వంతెనలపై ఏడో నెంబర్ ప్లామ్ ఫామ్ వరకే అనుమతిస్తారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ స్థానిక పోలీసులతో కలిసి అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ లైజనింగ్ నిర్వహించింది. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో కాన్వాయ్ తో రిహార్సల్స్ నిర్వహించారు.