Statue of Equality : హైదరాబాద్ పర్యటనపై మోడీ ట్వీట్

జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం పాదం మోపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో జరిపే రె

Statue of Equality : హైదరాబాద్ పర్యటనపై మోడీ ట్వీట్

Statue of Equality

Statue of Equality :  జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం పాదం మోపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో జరిపే రెండు పర్యటనలపై తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు.

ఈరోజు హైదరాబాద్ లో రెండు కార్యక్రమాల్లో పాల్గోంటున్నాను. మధ్యాహ్నం గం.2-45 కి వ్యవసాయ అవిష్కరణలకోసంపనిచేస్తున్న ఇక్రిశాట్ స్వర్ణోత్వ వేడుకల్లో పాల్గోంటాను.
సాయంత్రం గం.5 లకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గోంటాను. పవిత్రమైన ఆలోచనలు, బోధనల ద్వారా మనకు స్పూర్తి నిచ్చిన శ్రీరామానుజాచార్యకు ఇది సముచితమైన నివాళి అని ఆయన ట్వీట్ చేశారు.

విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సత్య సంకల్పంతో.. దివ్య సాకేతంలో రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం జాతికి అంకింతం చేయనున్నారు.

ఇప్పటికే అష్టాక్షరీ మంత్రంతో ముచ్చింతల్‌లో పులకరించిపోతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా, వైభవంగా కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో రెండు కీలక ఘట్టాలు కాగా.. అందులో ఒకటి రామానుజాచార్యుల మహావిగ్రహం జాతికి అంకితం ఇవ్వడం. ఈ రోజు రాత్రి ఆ ఘట్టం భక్తుల ముందు ఆవిష్కృతం కానుంది.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేస్తారు. అనంతరం యాగశాలకు చేరుకుంటారు. అక్కడ విశ్వక్సేన ఇష్టి పూర్ణాహుతిలో పాల్గొంటారు ప్రధాని మోదీ. మన అభీష్టాలను నెరవేర్చేందుకు కోసం విశ్వక్సేన ఇష్టి నిర్వహిస్తారు.. ప్రధాని చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలన్న సంకల్పంతో ఈ విశ్వక్సేన ఇష్టిని నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ.

విశ్వక్సేన ఇష్ఠి అనంతరం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు భగవత్‌ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రామానుజాచార్య స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకోని సమతామూర్తి విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడే భగవత్‌రామానుజాచార్యుల మహావిగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసంగించనున్నారు. సమతామూర్తి లేజర్‌ షోను తిలకించి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ.

సహస్రాబ్ది ఉత్సవాల్లో 1035 హోమగుండాల్లో దివ్యంగా జరుగుతున్న శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతికి మోదీ హాజరవుతారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 5 వేల మంది రుత్విజులు మోదీకి ఆశీర్వచనాలు అందిస్తారు. 8 గంటలకు భవ్యధామంలో ప్రధాని మోదీ పర్యటన ముగుస్తుంది. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరతారు.