Rape Case : మేనకోడళ్లపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోక్సో, అత్యాచార కేసు నమోదు

మేనకోడళ్లపై మామ అత్యాచారం చేసిన ఘటనపై 10టీవీ కథనానికి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌ దత్‌ స్పందించారు. మామ మల్‌రెడ్డి కృష్ణారెడ్డిపై పోక్సో, అత్యాచార కేసు నమోదు చేశారు.

10TV Telugu News

Pocso, rape case registered : మేనకోడళ్లపై మామ అత్యాచారం చేసిన ఘటనపై 10టీవీ ప్రసారం చేసిన కథనానికి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌ దత్‌ స్పందించారు. మేనకోడళ్లపై మామ అత్యాచారంపై జిల్లా పోలీస్‌ యంత్రాంగం వేగంగా విచారణ జరుపుతోంది. కీచక మామ మల్‌రెడ్డి కృష్ణారెడ్డిపై పోక్సో, అత్యాచార కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును పాల్వంచ పీఎస్‌కు బదిలీ చేశారు. ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

విచారణ తర్వాత పోలీసులు యువతులను సఖి కేంద్రానికి తరలించారు. తమకు జరిగిన అన్యాయాన్ని, మామ వ్యవహారశైలిని బాధితులు పోలీసులకు వివరించారు. త్వరలో యువతుల మామ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తోంది. అటు.. బాధితులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

Sexually Assaults : ఇద్దరు కోడళ్లపై కొన్నిరోజులుగా మేనమామ లైంగిక దాడి

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు 12ఏళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. వారిద్దరూ కవలలు. అయితే ఆ బాలికలకు తాను అండగా ఉంటానని, మేనమామ మల్‌రెడ్డి కృష్ణారెడ్డి చేరదీశాడు. ఆ చిన్నారులు కూడా తమ మేనమామే కదా అని ధైర్యంగా అతడితో వెళ్లారు. కానీ వారు ఎదిగిన తర్వాత అతడి బుద్ధి బయటపడింది. కామాంధుడిలా మారి ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అతడి వేధింపులు భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ ఎదురు తిరగడంతో.. వారిపై మేనమామ కృష్ణారెడ్డి చేయి చేసుకున్నాడు. విషయం బయటకు చెప్తే ఆస్తి మొత్తం తీసుకుని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తమను కామాంధుడి చెర నుంచి రక్షించాలని అక్కాచెల్లెళ్లు కొత్తగూడెం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.