Telangana : తెలంగాణలో చెరువుల పండుగ .. మంత్రి కేటీఆర్‌లో ఎగసిపడిన కవితా కెరటం

చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు అంటూ తెలంగాణ ‘చెరువుల పండగ ’ సందర్భంగా మంత్రి కేటీఆర్ లో కవిత కెరటం ఎగసిపడింది.‘చెరువే ఊరికి ఆదరువు’ అని సాటిచెప్పేందుకీ పండుగ నిర్వహిస్తోంది ప్రభుత్వం.

Telangana : తెలంగాణలో చెరువుల పండుగ .. మంత్రి కేటీఆర్‌లో ఎగసిపడిన కవితా కెరటం

KCR And KTR

Telangana Cheruvula Panduga : చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు సీఎం కేసీఆర్ అంటూ తెలంగాణ ‘చెరువుల పండగ ’ సందర్భంగా మంత్రి కేటీఆర్ లో కవిత కెరటం ఎగసిపడింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు చెరువుల పండు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ చేసింది సీఎం కేసీఆర్ ప్రభుత్వం..రాష్ట్రం ఏర్పాటు తరువాత చెరువుల పునరుద్ధరణ, ఆయకట్టు స్థిరీకరణ,చెక్ డ్యామ్ ల నిర్మాణంతో పాటు చెరువును ఎప్పుడూ నిండు కుండల ఉండడం రైతాంగానికి ఉపయోగ పడే తీరును ప్రజలకు వివరించనున్నారు.

ఈ చెరువుల పండుగ సందర్భంగా ‘చెరువే ఊరికి ఆదరువు’ అని సాటి చెప్పనున్నారు. చెరువు అనేది పల్లెలో ఉన్నా..నగరంలో ఉన్నా అది ప్రజలకు ఉపయోగపడేలానే ఉంటుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహించే ‘చెరువుల పండుగ’ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెరువులపై తన ట్విట్టర్ లో చెరువులపై కవిత రూపంలో తన భావాలను వ్యక్తంచేశారు. చెరువుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిని తన కవితలో వెల్లడించారు.

పదేళ్ల క్రితం…
ఏ చెరువును చూసినా గుండెబరువు..వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువు
కానీ..దశాబ్ది ఉత్సవాల వేళ..ప్రతి చెరువు…కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువు

చుక్కనీరు లేక చిక్కిశల్యమైన
అమ్మలాంటి ఊరి చెరువుకు
ఊపిరిపోసిన నాయకుడు…
గొలుసుకట్టు చెరువుల
గోస తీర్చిన పాలకుడు…

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు…
చెరువులకు పట్టిన
దశాబ్దాల శిలుమును

వదిలించిన విప్లవం పేరే..
మిషన్ కాకతీయ
“వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా”
మెచ్చిన పథకమిది

మిచిగాన్ యూనివర్సిటీ”కి
నచ్చిన పథకమిది

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు
ప్రాణం పోసిన తరుణమిది
పొలిమేరల్లో ఉన్న చెరువును
ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇది..

అమృతోత్సవ వేళ
మన మిషన్ కాకతీయ
దేశానికే ఆదర్శమైంది..

“తెలంగాణ మోడల్”
“అమృత్‌ సరోవర్‌” రూపంలో
దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైంది..

మండువేసవిలో
మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా…
ఈ మహాయజ్ఞంలో
మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి…

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
చెరువుల పండుగ శుభాకాంక్షలు…