YS Sharmila: కేసీఆర్ అవినీతి పాలనపై ఢిల్లీలో షర్మిల ర్యాలీ.. అరెస్ట్ చేసిన పోలీసులు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. షర్మిలతోపాటు వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే, ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.

YS Sharmila: కేసీఆర్ అవినీతి పాలనపై ఢిల్లీలో షర్మిల ర్యాలీ.. అరెస్ట్ చేసిన పోలీసులు

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, పార్టీ శ్రేణులు ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేపట్టాయి. అయితే, ఢిల్లీ పోలీసులు షర్మిలను, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు.

Joe Biden Viral Video : బ్యాంకుల సంక్షోభం గురించి ప్రశ్నించిన మీడియా..సమాధానం చెప్పకుండా వేరే రూమ్‌లోకెళ్లి డోర్ వేసేసుకున్న బైడెన్

షర్మిలతోపాటు వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే, ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు షర్మిలను, నేతలను అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది. దానిపై విచారణ జరిపించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద స్కాం. దీని ద్వారా దేశ ప్రజల సొమ్ము లక్ష కోట్లు కేసీఆర్ దోచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అవినీతికి పాల్పడ్డారు. కమీషన్ల కోసం రిడిజైన్ పేరుతో భారీ అవినీతి జరిగింది. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్షా యాభై వేల కోట్లకు పెంచారు.

Allu Arjun: తెలుగు పాట ఆస్కార్స్‌ను షేక్ చేయడం గర్వకారణం – అల్లు అర్జున్

మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యాయాన్ని పెంచారు. ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు. వారికి న్యాయం చెయ్యలేదు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారు. ప్రతి ఏటా వేల ఎకరాలు ముగినిపోతున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారు. ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది. దీనిపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలి. రూ.70 వేల కోట్ల అవినీతిత జరిగింది. 2జీ, కోల్ గేట్‌కు తీసిపోని స్కాం కాళేశ్వరం. కేసీఆర్ ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో చేపట్టి, కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు.

ఇంత ఖర్చు చేసి కేవలం లక్షా 50 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చారు. అవసరం లేని దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ ఇది. పంప్ హౌజ్‌ల ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారు. నాసిరకం పనులు చేశారు. ఈ పనుల నాణ్యతపై ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. నీళ్లను ఎత్తిపోయడానికి పవర్ బిల్ 3 వేల కోట్లు ఖర్చయింది. లోన్లకు వడ్డీలే 13 వేల కోట్లు కడుతున్నారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.