Hi-Tech prostitution racket : హైటెక్ సిటీలోని ఆ స్టార్ హోటల్‌లో పాడు పని.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు

హైదరాబాద్ నగరంలో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా దందా సాగిస్తున్నాయి. ఓవైపు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా... మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను కంటిన్యూ చేస్తున్నారు. హైటెక్ పద్ధతుల్లో యువతులను వివిధ ప్రాంతాల నుంచి రప్పించి విటులకు వల వేస్తున్నారు. తాజాగా నగరంలో మరో వ్యభిచార ముఠా దొరికింది. ఐటీ కారిడార్ గా గుర్తింపు పొందిన హైటెక్ సిటీ ప్రాంతంలో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Hi-Tech prostitution racket : హైటెక్ సిటీలోని ఆ స్టార్ హోటల్‌లో పాడు పని.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు

Hitech City

Hitech City Prostitution : హైదరాబాద్ నగరంలో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా దందా సాగిస్తున్నాయి. ఓవైపు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా… మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను కంటిన్యూ చేస్తున్నారు. హైటెక్ పద్ధతుల్లో యువతులను వివిధ ప్రాంతాల నుంచి రప్పించి విటులకు వల వేస్తున్నారు. తాజాగా నగరంలో మరో వ్యభిచార ముఠా దొరికింది. ఐటీ కారిడార్ గా గుర్తింపు పొందిన హైటెక్ సిటీ ప్రాంతంలో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

మాదాపూర్ లోని ఓ స్టార్‌ హోటల్‌పై యాంటీ హ్యూమన్‌ ట్రాకింగ్‌ టీమ్‌ దాడి చేసింది. విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకుంది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్‌ పోలీసులకు అప్పగించింది. యువతుల్లో ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఇద్దరు ఉన్నారు.

యువతుల పేరిట ఐదు రూమ్‌లు బుక్‌ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్‌లు ఫోన్‌లో విటులతో మాట్లాడి హోటల్‌కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. సోమవారం(ఏప్రిల్ 12,2021) సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాకింగ్‌ టీమ్‌ సదరు హోటల్‌పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్‌పేట్‌కు చెందిన జ్ఞాన శేఖర్‌ మణికంఠన్‌(44)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.29వేల 560 నగదు, కండోమ్‌ ప్యాకెట్లు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహాకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.