R Krishnaiah: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పై పోలీస్ కేసు నమోదు

ఆర్ కృష్ణయ్య వ్యక్తిగతంగా ఓ వ్యక్తి నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

R Krishnaiah: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పై పోలీస్ కేసు నమోదు

Krishna

R Krishnaiah: బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆర్ కృష్ణయ్య వ్యక్తిగతంగా ఓ వ్యక్తి నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఏపీలోని వైకాపా తరుపున రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టాడు. వివరాల్లోకి వెళితే ..నందిహిల్స్ కు చెందిన రవీందర్ రెడ్డికి ఆర్.కృష్ణయ్యతో గత కొంతకాలంగా పరిచయం ఉంది. ఈక్రమంలో ఆర్ కృష్ణయ్య తన నుంచి కొంత డబ్బు తీసుకున్నాడని, తిరిగి చెల్లించమని అడిగితే..తనకు పాత బస్తీ గుండాలు తెలుసు..నీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తున్నాడని బాధితుడు రవీందర్ రెడ్డి పేర్కొన్నాడు. తన గెస్ట్ హౌజ్ కు గుండాలను పంపి దాడి చేయించాడని, నా భూములను కూడా రవీందర్ రెడ్డి వాపోయాడు.

Other Stories: Pawan Kalyan On Konaseema : కోనసీమ వివాదం రాజకీయ కుట్ర, అమిత్ షాకు లేఖ రాస్తాం-పవన్ కళ్యాణ్

ఆర్ కృష్ణయ్యపై గత నెల మే 18న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదని..దీనితో కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆర్ కృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే రవీందర్ రెడ్డి ఆరోపణలపై ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ..తనతో పాటు బీసీ ఉద్యమంలో పాల్గొన్న రవీందర్ రెడ్డి.. తమ బంధువుల వద్ద డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని..తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో తాను కల్పించుకుని డబ్బులు అడగడంతోనే తనపై పోలీసు కేసు పెట్టించాడని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈమొత్తం వ్యవహారాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాయదుర్గం ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపారు.