Nampally Railway Station : సికింద్రాబాద్ లో విధ్వంసం..నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత | police close Nampally railway station due to protests in Secunderabad railway station

Nampally Railway Station : సికింద్రాబాద్ లో విధ్వంసం..నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Nampally Railway Station : సికింద్రాబాద్ లో విధ్వంసం..నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత

Nampally railway station : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేక ఆందోళన తెలంగాణకు పాకింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం ఉదయం ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌లోకి దూసుకొచ్చిన కొందరు యువకులు పలు రైళ్లకు నిప్పు పెట్టి దహనం చేశారు. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనమయ్యాయి. రైల్వే స్టేషన్‌కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ‘సేవ్ ఆర్మీ’ అంటూ నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్‌లోని షాపులు, సీసీ కెమెరాలు, ఫర్నీచర్, అద్దాలు సహా అనేక ఆస్తులను ధ్వంసం చేశారు. రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు. పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు.
Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు

రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్టేషన్‪లోని ప్రయాణికులను పోలీసులు బయటకు పంపేశారు. సికింద్రాబాద్ రావాల్సిన, వెళ్లాల్సిన రైళ్లను అధికారులు రద్దు చేశారు.

మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని యువకులు అంటున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

×