Secunderabad Hawala Cash : సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో భారీగా హవాలా సొమ్ము గుర్తింపు
భారీగా బయటపడిన నోట్ల కట్టలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.

hawala cash
Police Found Hawala Cash : సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో భారీగా హవాలా సొమ్ము బయటపడింది. అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో కోటి రూపాయలకు పైగా హవాలా నగదును పోలీసులు గుర్తించారు. భారీగా బయటపడిన నోట్ల కట్టలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.
రెజిమెంటల్ బజార్ లోని ఓ ఇంట్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
CBI Raids : వామ్మో.. ఎంత డబ్బో.. కట్టలు కట్టలుగా బయటపడింది.. ఎక్కడో తెలుసా!
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. అగ్నిప్రమాద ఘటనపై విచారణకు వెళ్లిన గోపాలపురం పోలీసులు ఆ ఇంట్లో లభించిన నగదును చూసి షాక్ అయ్యారు. నగదును స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు సమాచారం అందించారు.