FIR : మరణించిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ల్యాండ్ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ఎకరాల భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.

FIR : మరణించిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

Fir

FIR against deceased : హైదరాబాద్ లో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఏకంగా మరణించిన వ్యక్తిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ల్యాండ్ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ఎకరాల భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. రూ.90 కోట్ల విలువైన భూమి నాదంటే నాదంటూ.. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేశాడు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమిలోకి తన తండ్రి దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి పిర్యాదు చేశారు. గచ్చిబౌలి ఎస్ఐ ఫోన్ చేసి.. భూమి విషయం సెటిల్ చేసుకోమని లేదంటే కేసు రాస్తానంటూ బెదిరించాడు.

Dead Man Gets Vaccine : మే నెలలో చనిపోయిన వ్యక్తికి..డిసెంబర్ లో వ్యాక్సిన్ సెకండ్ డోసు

ప్రాథమిక విచారణ జరుగకుండానే సెక్షన్ 447, 427 కింద కేసు నమోదు చేశారు. కుమారుడికి 41 సీఆర్పీసీ కింద తఖితులు జారీ చేశారు. తండ్రి ఏప్రిల్ లో చనిపోతే డిసెంబర్ లో స్థలం కబ్జా చేశారంటూ కుమారుడు కోర్టును ఆశ్రయించాడు.