Police recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎత్తు విషయంలో వారికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దేహదారుఢ్య పరీక్షల్లో 1 సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హతకు గురైన అభ్యర్థులు తిరిగి అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆయా అభ్యర్థులకు అధికారులు మళ్ళీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంబర్ పేట్, కొండాపూర్ లో అభ్యర్థుల ఎత్తును మళ్ళీ కొలుస్తారు.

Police recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు

Police recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎత్తు విషయంలో వారికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దేహదారుఢ్య పరీక్షల్లో 1 సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హతకు గురైన అభ్యర్థులు తిరిగి అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆయా అభ్యర్థులకు అధికారులు మళ్ళీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంబర్ పేట్, కొండాపూర్ లో అభ్యర్థుల ఎత్తును మళ్ళీ కొలుస్తారు.

అర్హత ఉన్న అభ్యర్థులు మరోసారి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ నియామక మండలి సూచించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని 1 సెం.మీ తక్కువ ఎత్తువల్ల కొందరు అభ్యర్థులు అర్హత కోల్పోయిన విషయం తెలిసిందే.

దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆయా అభ్యర్థులు మళ్ళీ ఎత్తుకు సంబంధించిన కొలతలు ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజులుగా పోలీసు నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Kalvakuntla Kavitha: అదానీ గురించి పార్లమెంటులో ప్రధాని మోదీ జవాబు చెప్పలేదు: ఎమ్మెల్సీ కవిత