MLA Rajasingh: రాజాసింగ్‌పై మరో కేసు నమోదు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన గోషామహల్ ఎమ్మెల్యే

పోలీసులు తనపై మరోకేసు నమోదు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

MLA Rajasingh: రాజాసింగ్‌పై మరో కేసు నమోదు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన గోషామహల్ ఎమ్మెల్యే

Rajasingh

MLA Rajasingh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. పోలీసులు అతని పై మరో కేసు నమోదు చేశారు. దీంతో మూడు రోజుల్లోనే మూడు కేసులు రాజాసింగ్ పై నమోదయ్యాయి. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడంటూ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదు పట్ల పోలీసుల తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Rajasingh: తన మీద సస్పెన్షన్ ఎత్తివేయకపోతే అంటూ బీజేపీకి రాజాసింగ్ హెచ్చరిక

నన్ను చంపుతామని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, నా కొడుకును కిడ్నాప్ చేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని రాజాసింగ్ ఆరోపించారు. రంజాన్ డిస్టర్బ్ అవుతుందని నిన్ను ఏం చేయకుండా వదిలిపెట్టాం, లేకపోతే బాంబు పెట్టి లేపేసేవాళ్ళం.. బతికి పోయావు అంటూ బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ నాకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏం చేయడం లేదు కాబట్టి వాళ్లకు నేను ఫిర్యాదు చేయదలచుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. పోలీసులు మాత్రం నా‌పైన కేసులు పెడుతూనే ఉన్నారని, నేను ఏం మాట్లాడినా కేసు పెట్టడమే వారి విధిగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Rajasingh: బుల్లెట్ ఫ్రూప్ వాహనంతో ప్రగతిభవన్‌కు రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు

పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని రాజాసింగ్ ప్రశ్నించారు. ఇదిలాఉంటే ఇటీవల శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజా సింగ్ ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది. తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇతర వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు రాజాసింగ్ పై ఐపీసీ 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రాజాసింగ్ ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.