Drugs Smuggler Tony : ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

అవసరమైతే ఫారెన్‌ లాంగ్వేజెస్‌ తెలిసిన వారి సాయం తీసుకోనున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. టోనీ కస్టడీతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

Drugs Smuggler Tony : ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

Tony

drugs smuggler Tony into custody : ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీని ఇవాళ పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న టోనీని నేడు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 2వరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో అతనిని విచారించనున్నారు. నేటి నుండి టోనీని ఐదురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని వివిధ కోణాల్లో విచారించనున్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. హైదారాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో స్పెషల్‌ టీమ్‌ టోనీని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీస్ విచారణలో టోనీ వెనుక ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియాకు చెందిన స్టార్ బాయ్ పై కూపీ లాగనున్నారు. 2013 నుండి ఇండియాలో ముంబాయి కేంద్రంగా ఎలా డ్రగ్స్ దందాకు తెరలేపాడు? ఎవరెవరు ద్వారా డ్రగ్స్ వ్యాపారులకు చేరవేశాడు హైదరాబాద్ లో వ్యాపారులతో లింక్స్ డ్రగ్స్ డిలింగ్, డ్రగ్స్ సరఫరా, లావాదేవీలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. టోనీ గ్యాంగ్ లో ఆ 30 మంది ఎక్కడ ? వెస్ట్రన్ మనీ యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఎలా నగదు ట్రాన్స్ఫర్ చేశాడు ? బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ లైన్ మని ట్రాన్స్ ఫర్ ఎక్కడ ఎప్పుడు ఎలా ట్రాన్సాక్షన్స్ జరిపేవాడు? అనే వివిధ కోణాల్లో విచారణ చేపట్టనున్నారు.

Amul Products : అంగన్‌వాడీలకు ‘అమూల్‌’ ఉత్పత్తులు.. కొత్తగా అనంతపురంలో ‘జగనన్న పాలవెల్లువ’

టోనీ మొబైల్ కాల్ డేటా మరియు మెసెంజర్, వాట్సాప్ చాటింగ్ ద్వారా ఏ విధంగా వ్యాపారులకు డ్రగ్స్ సప్లై చేశాడు ? ముంబాయి నుండి నెట్వర్క్ ఎలా నడిపాడు ? అన్న కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. ముంబైని అడ్డాగా చేసుకుని షిప్ ల ద్వారా టోని డ్రగ్స్ లావాదేవీలు జరుపుతున్నారు. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న నలుగురు వ్యాపారులు ఎక్కడ ? వివిధ కోణాల్లో పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. టోనీని విచారిస్తే హైదరాబాద్ లో ఉన్న మరి కొంతమంది బడాబాబుల లింకులు బయట పడుతాయని పోలీసులు భావిస్తున్నారు.

అవసరమైతే ఫారెన్‌ లాంగ్వేజెస్‌ తెలిసిన వారి సాయం కూడా తీసుకోనున్నారు. ఈ విచారణలో మరికొన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. టోనీ కస్టడీతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు డ్రగ్స్‌ కేసులో పరారీలో ఉన్న నలుగురు వ్యాపారుల కోసం గాలింపు నిర్వహిస్తున్నామని హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. అలాగే ఈ కేసులో చంచల్‌గూడ జైల్లో ఖైదీలుగా ఉన్న వ్యాపారులను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని వెల్లడించారు.

CM Jagan Letter : ఆలిండియా సర్వీస్ రూల్స్ లో సవరణలు.. కేంద్రానికి సీఎం జగన్ ప్రతిపాదనలు

డ్రగ్స్ కేసుతో ప్రమేయం ఉన్న 30 మంది ప్రముఖుల చిట్టా పోలీసుల వద్ద ఉంది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఏడుగురు బిజినెస్‌మెన్‌లు ఉన్నారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. టోనీతో బిజినెస్‌మెన్స్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ముంబై డ్రగ్ మాఫియా టోనీతో వ్యాపారవేత్తలు నిత్యం డ్రగ్స్ తెప్పించుకున్నారు. పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మురో 15 మంది వ్యాపారులను పోలీసులు గుర్తించారు.