Huzurabad Politics : హుజూరాబాద్ లో పొలిటికల్ హీట్, టీఆర్ఎస్ కు పలువురు రాజీనామా

ఐదు మండలాల టీఆర్ఎస్వీ అధ్యక్షులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 10వ తేదీ గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. మూకుమ్మడిగా 300 మంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Huzurabad Politics : హుజూరాబాద్ లో పొలిటికల్ హీట్, టీఆర్ఎస్ కు పలువురు రాజీనామా

Trs

Political heat in Huzurabad : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఆయన నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించిన అనంతరం రాజకీయాలు మారిపోతున్నాయి. తాజాగా…ఐదు మండలాల టీఆర్ఎస్వీ అధ్యక్షులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 10వ తేదీ గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. మూకుమ్మడిగా 300 మంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…

ఈటెలను వేధించాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన వ్యక్తి ఈటెల అని, ఆయన వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నార. ఈటెల మీద లేని పోని ఆరోపణలు వేసి కావాలని పార్టీ నుండి బయటకు పంపించారని ఆరోపించారు. మంత్రులు గంగుల కమాలాకర్, హరీష్ రావు, ఎరబెల్లి దయాకర్ రావు..ఇతరులు ఎంతమంది వచ్చినా ఈటెలకు ఏం కాదన్నారు నేతలు. ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రులు బెదిరించినా ఈటల వెనుక అడుగు వేయని వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read More : CM Jagan Delhi Tour : ఢిల్లీలో సీఎం జగన్.. కేంద్ర మంత్రులను కలిసే అవకాశం