KTR: పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తారు.. వెళ్తారు.. మనం ఏం చేశామో ప్రజలకు చెబితే చాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తారు, వెళ్తారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదివి వెళ్తారు. వాళ్ల మాటలను..

KTR: పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తారు.. వెళ్తారు.. మనం ఏం చేశామో ప్రజలకు చెబితే చాలు

Ktr

KTR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తారు, వెళ్తారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదివి వెళ్తారు. వాళ్ల మాటలను ప్రజలు పట్టించుకోవద్దంటూ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శనివారం కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. గీసుకొండ మండలం హవేలీలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్ టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. అనంతరం మిషన్‌ భగీరథ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. జేపీ నడ్డా, రాహుల్ గాంధీ పర్యటనలపై సెటైర్లు వేశారు.

TRS Plenary : కేంద్ర సర్కార్‌‌పై కేటీఆర్ నిప్పులు.. ప్లీనరీలో పవర్ ఫుల్ స్పీచ్

రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తారు వెళ్తారని, మొన్న మహబూబ్‌నగర్‌కు ఒకరువచ్చారు, నిన్న వరంగల్‌కు ఒకరు వచ్చారు. వాళ్లొచ్చినా చేసేదేమీలేదు. వారి‌వారి పార్టీ నాయకులు ఇచ్చిన స్ర్కిప్ట్ లు చదివి వెళ్లిపోతారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎవరెవరో వస్తారు.. ఏవేవో చెబుతారు.. ఈ పొలిటికల్ టూరిస్ట్ లను తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దని కేటీఆర్ సూచించారు. వరంగల్‌కు నిన్న ఓ పొలిటికల్ టూరిస్ట్ వచ్చిపోయాడని, ఆయనకు వడ్లు తెలియదు, ఎడ్లు తెలియదు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు రాసిచ్చింది చదివి, హైదరాబాద్ బిర్యాని తిని వెళ్లిపోతారంటూ కేటీర్ విమర్శించారు. టీఆర్ఎస్ లేకపోతే టీపీసీసీ, టీ బీజేపీ ఉండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ వల్లనే వీళ్లందరికి పదవులొచ్చాయని కేటీఆర్ అన్నారు. ప్రజలకు మనం ఏం చేస్తున్నామో చెబితే చాలని, తెరాస నేతలు ఈ పొలిటికల్ టూరిస్ట్ ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.