Ponguleti Srinivasa Reddy: ఖమ్మంలో తారస్థాయికి పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్.. ఎమ్మెల్యే సండ్రపై పొంగులేటి అనుచరుల విమర్శలు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొంగులేటిపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు పొంగులేటి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విమర్శలు చేశారు.

Ponguleti Srinivasa Reddy: ఖమ్మంలో తారస్థాయికి పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్.. ఎమ్మెల్యే సండ్రపై పొంగులేటి అనుచరుల విమర్శలు

Ponguleti Srinivasa Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొంగులేటిపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు పొంగులేటి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విమర్శలు చేశారు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

‘‘సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయింది. భారీగా వచ్చిన జన సముహాన్ని చూసి ఎమ్మెల్యే సండ్రకు నిద్రపట్టడం లేదు. వెన్నుపోటు పొడవడం సండ్రకు అలవాటు. ఖమ్మం నగరంలో ఎన్ఎస్‌పీ భూమిని కారు చౌకగా తీసుకొని బీఅర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ విషయం జనం అందరికీ తెలుసు. మాకు స్పష్టమైన ఎజెండా ఉంది. మా ఎజెండా చెప్పాకే పది నియోజకవర్గాల్లో జనం ముందుకు వెళతాం. పొంగులేటిపై సండ్ర వెంకటవీరయ్య వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మేము కూడా సండ్రపై వ్యక్తి గతంగా దాడి చేస్తే ఆయన తట్టుకోలేరు. త్వరలోనే సండ్ర అక్రమాల చిట్టాను బయట పెడతాం. పార్టీలు మారే ఊసరవెల్లి సండ్ర. చివరి వరకు సండ్ర బీఅర్ఎస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదు. పొంగులేటిని విమర్శించే స్థాయి సండ్రకు లేదు’’ అని పిడమర్తి రవి వ్యాఖ్యానించారు.

YS Sharmila: కేసీఆర్ అవినీతి పాలనపై ఢిల్లీలో షర్మిల ర్యాలీ.. అరెస్ట్ చేసిన పోలీసులు

మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ ‘‘వచ్చే ఎన్నికల్లో పొంగులేటి సునామీ లో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్ధానం కూడా రాదు. సీతారామ ప్రాజెక్ట్ పనులను ఆలస్యం చేస్తున్నారని పొంగులేటి మాట్లాడారు. ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తయితే రైతులకు లాభం జరుగుతుందనే ఉద్దేశ్యంతో పొంగులేటి మాట్లాడితే దానిని కూడా తప్పు పడుతున్నారు. ఖమ్మం పట్టణంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. బీఅర్ఎస్‌లో మంత్రిని కూడా బొందపెట్టే కుట్ర జరుగుతోంది. ఆ విషయాన్ని ముందు మంత్రి గమనించాలి’’ అన్నారు.