Ponnala Lakshmaiah : 3 రాష్ట్రాలను ఇచ్చిన బీజేపీ.. అక్కడ ఎందుకు గెలవలేకపోయింది-పొన్నాల

3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? పారిశ్రామికవేత్తలకు మేలు చేయడం మినహా సామాన్యులకు మోదీ చేసిన అభివృద్ధి శూన్యం.

Ponnala Lakshmaiah : 3 రాష్ట్రాలను ఇచ్చిన బీజేపీ.. అక్కడ ఎందుకు గెలవలేకపోయింది-పొన్నాల

Ponnala Lakshmaiah

Ponnala Lakshmaiah : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై నిప్పులు చెరగడం తెలిసిందే. ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా కాంగ్రెస్ కు అహంకారం తగ్గలేదన్నారు. అంతేకాదు తెలంగాణ ఇచ్చినా ప్రజలు ఆ పార్టీని ఓడించారని మోదీ అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ ను హడావుడిగా విభజన చేసిందని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు మోదీ.

కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీకి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ప్రధాని కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఘాటుగా స్పందించారు. గతంలో బీజేపీ మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చిందని, అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలవలేదని పొన్నాల ప్రశ్నించారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని ప్రధాని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఏదేమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంగీకరించారని పొన్నాల అన్నారు.

Snacks : చిరుతిళ్లతో రోజంతా గడిపేస్తున్నారా?…

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, అంతటి మహోన్నత పార్టీని తుక్డే తుక్డే పార్టీ అనడం సరికాదన్నారు. అయినా మోదీ పాలనలో ఏం ఒరిగిందని పొన్నాల నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేశారే తప్ప సామాన్యులు ఏం చేశారని ప్రశ్నించారు.

”రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ప్రధాని మోదీ వాస్తవాలకు భిన్నంగా మాట్లాడారు. ఏది ఏమైనా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఇచ్చిందనే నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే కరోనా ఆగిందా? ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పాటు పడే పార్టీ కాంగ్రెస్‌. రైతు రుణమాఫీ చేసి మద్దతు ధరపై కమిషన్‌ వేసిన చరిత్ర కాంగ్రెస్ ది. పారిశ్రామికవేత్తలకు మేలు చేయడం మినహా సామాన్యులకు మోదీ చేసిన అభివృద్ధి శూన్యం. చమురు ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిన చరిత్ర మోదీది. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదు” అని పొన్నాల అన్నారు.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాల విభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పై మండిపడ్డారు. సొంత నేతలనూ వాళ్లు పట్టించుకోలేదని, సభలో మైకులు కట్ చేశారని, డోర్లు మూసేసి ఏపీని విభజించారని అసహనం వ్యక్తం చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి కూడా మూడు రాష్ట్రాలను విభజించినా.. శాంతియుత వాతావరణంలో రాష్ట్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణను తాము వ్యతిరేకించడం లేదని, కానీ, శాంతియుతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని మాత్రమే అంటున్నామని మోదీ అన్నారు.