Posters Against Amit Shah : అమిత్‌షాకు వ్యతిరేకంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో వెలిసిన పోస్టర్లు.. కేంద్రానికి 20 ప్రశ్నలు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్‌ 17 సందర్భంగా అమిత్‌ షా.. హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో అమిత్‌ షాకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు అంటించారు.

Posters Against Amit Shah : అమిత్‌షాకు వ్యతిరేకంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో వెలిసిన పోస్టర్లు.. కేంద్రానికి 20 ప్రశ్నలు

Posters against Amit Shah

Posters Against Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్‌ 17 సందర్భంగా అమిత్‌ షా.. హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో అమిత్‌ షాకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు అంటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు వెలిశాయి.

కంటోన్మెంట్ యువత పేరుతో ఉన్న ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల అస్త్రాలు సంధించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని పోస్టర్లు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లేనంటూ అని రాసివున్న మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలను సంధించారు.

Prabhas : బాహుబలితో భేటీ కానున్న అమిత్ షా.. అందుకోసమే..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు రాత్రి 10గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నఅమిత్ షా.. రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారు. విమోచన దినోత్సవం రోజంతా హైదరాబాదులోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

సెప్టెంబర్ 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే సభకు అమిత్ షా హాజరువుతారు. ఉదయం 8.45 గంటల నుంచి 11.45 గంటల వరకు అమిత్ షా అక్కడే ఉంటారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. సభ అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజా‌కు బయలుదేరుతారు. టూరిజం ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు అమిత్ షా చేరుకుంటారు.