Minister Jagadish Reddy : కేంద్రం ఆదేశం రాజకీయ కక్షసాధింపే, ఏపీ ప్రభుత్వమే రూ.12వేల కోట్లు ఇవ్వాలి-మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 6వేల 756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. రాజకీయకక్ష సాధింపు అని ఆరోపించారు.

Minister Jagadish Reddy : కేంద్రం ఆదేశం రాజకీయ కక్షసాధింపే, ఏపీ ప్రభుత్వమే రూ.12వేల కోట్లు ఇవ్వాలి-మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy

Minister Jagadish Reddy : తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 6వేల 756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. రాజకీయకక్ష సాధింపు అని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వమే తెలంగాణకు రూ.12వేల 941 కోట్లు బకాయిలు చెల్లించాల్సింది ఉందన్నారు. ఈ విషయంలో అటు కేంద్రంతో పాటు ఇటు ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించడం ఏంటని మండిపడ్డారు జగదీశ్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏపీకి చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్లతో పాటు సర్ చార్జీని కూడా కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2014 జూన్ 2నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ ను సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించలేదని ఆ రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో విద్యుత్ సరఫరాకు సంబంధించి రూ.3,441.78 కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు సకాలంలో ఈ నిధులు చెల్లించనందుకు లేటు ఫీజు కింద అదనంగా రూ.335.14 కోట్లు కూడా చెల్లించాలంది.

ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌కు గాను చెల్లించాల్సిన రూ. 3,441.78 కోట్లతోపాటు, చెల్లింపులో జరిగిన జాప్యానికి సర్‌చార్జ్ రూ.3,315.14 కోట్లు (31 జులై 2022 వరకు) కలిపి మొత్తంగా

ఏపీకి మొత్తం రూ.6,756.92 కోట్లు (రూ. 3,441.78 కోట్లు+రూ.3,315.14 కోట్లు(సర్ చార్జి)) 30 రోజుల్లోగా చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశంపై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయ్యింది. కేంద్రం ఆదేశంపై న్యాయ పోరాటం చేస్తామంది. తెలంగాణలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ధ్వజమెత్తింది. వనరుల వినియోగంతో దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే కేసీఆర్ వ్యాఖ్యలు బీజేపీకి రుచించడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నందునే తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపణలు చేశారు.

వాస్తవానికి ఏపీ నుండే తెలంగాణకు రూ.12,941 కోట్లు రావాల్సి ఉందన్నారు. అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఏకపక్షంగా ఏపీ వాదనలు విని ఉత్తర్వులు ఇచ్చిందని ఫైర్ అవుతున్నారు.