Nunna Village : లక్షల జీతం వదులుకుని కోళ్ల పెంపకం

లక్షల జీతం వదులుకున్నాడు..కార్పొరేట్ స్థాయి ఉద్యోగం ఉన్నా..వద్దు అనుకున్నాడు..కోళ్ల పెంపకమే బెటర్ అని అనుకుని..ఉద్యోగానికి రాం రాం చెప్పాడు. నాటు కోళ్ల పెంపకం చేస్తూ..రెండు చేతులా సంపాదిస్తూ...నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇతను చేస్తున్న కృషికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ సత్కరించింది. ఉత్తమ రైతు అవార్డు ప్రకటించింది.

Nunna Village : లక్షల జీతం వదులుకుని కోళ్ల పెంపకం

Farm

Pradeep Sucessfully Business : లక్షల జీతం వదులుకున్నాడు..కార్పొరేట్ స్థాయి ఉద్యోగం ఉన్నా..వద్దు అనుకున్నాడు..కోళ్ల పెంపకమే బెటర్ అని అనుకుని..ఉద్యోగానికి రాం రాం చెప్పాడు. నాటు కోళ్ల పెంపకం చేస్తూ..రెండు చేతులా సంపాదిస్తూ…నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇతను చేస్తున్న కృషికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ సత్కరించింది. ఉత్తమ రైతు అవార్డు ప్రకటించింది. ఆయనే..ప్రదీప్. ఏపీలోని కృష్ణా జిల్లాలోని నున్న గ్రామానికి చెందిన వారు.

Read More : పాదయాత్రతో పదవి కొట్టాలని చూస్తున్న బీజేపీ

ఎంబీఏ పూర్తి చేసిన ప్రదీప్ : –
ప్రదీప్. ఇతను MBA పూర్తి చేశాడు. ఓ కార్పొరేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే..వారంలో కేవలం ఐదు రోజులే పని. దీంతో రెండు రోజులు ఖాళీగా ఉండడం ఎందుకని..కోళ్ల పెంపకంపై దృష్టి సారించాడు. ఈ రంగంపై అతనికి ఆసక్తి పెరింది. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గుంటకోడూరులో కోళ్ల పెంపకం చేపట్టాడు. మార్కెటింగ్ లో తొలుత ఇబ్బందులు వచ్చేవి. అయినా..తట్టుకుని నిలబడ్డాడు. సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. వ్యాపారం బాగా పెరిగింది. నున్నలో ప్రదీప్ ఫామ్స్ అండ్ హేచరీస్ తో పాటు..చికెన్ వరల్డ్ కంపెనీని ప్రారంభించాడు. నాటుకోళ్లు, కడక్ నాథ్ కోళ్లు, సిల్కీ, బీవీ 380, ఆర్ఐఆర్ జాతులతో పాటు…టర్కీ, గిన్నికోళ్లు..బాతుల పెంపకం ప్రారంభించాడు. ప్రస్తుతం వ్యాపారం బాగానే సాగుతోంది. ఫామ్ లో వేయికిపైగా కడక్ నాథ్ కోళ్లు, 2 వేలకు పైగా ఇతర జాతులున్నాయి.

Read More : హుజూరాబాద్ ఉప ఎన్నిక… రోజుకో ట్విస్ట్

కోళ్ల ఫ్యాక్టరీ : –
తాజాగా..ప్రదీప్ పందెం కోళ్ల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఫిలిప్పీన్స్ పెరువియన్ జాతి కోళ్లను దిగుమతి చేసుకోవడమే కాదు…దేశీయ పందెం కోళ్లతో క్రాసింగ్ చేయించి పెరు కోళ్లను అభివృద్ధి చేస్తున్నాడు. వీటి గుడ్డును రూ.3 వేలకు విక్రయిస్తుండగా, రసంగి, గేరువా, సీతువా, వైట్‌నాట్, బ్లాక్‌నైట్‌ వంటి పెరువియన్‌ జాతి కోడిపుంజుల ధర అయితే రూ.3 లక్షల పైమాటే.

ఎంబీఏ పూర్తి చేసిన ప్రదీప్ : –
ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 వేలకు పైగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే పందెం కోళ్లున్నాయి. కోళ్ల పెంపకానికి ముందుకొచ్చే యువతకు 30 శాతం సబ్సిడీతో కోళ్లను ఇవ్వనున్నట్లు చెప్పారు.  ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే అవకాశం కల్పించారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పాటు..విదేశాలకు కూడా కోళ్లను ఎగమతి చేస్తున్నారు. ప్రత్యక్షంగా 50 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ప్రదీప్..ఫామ్స్ పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నాడు.