KA Paul : అందుకే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన.. బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్

బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు.

KA Paul : అందుకే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన.. బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్

Ka Paul

KA Paul : టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారని కేఏ పాల్ ప్రశ్నించారు. కేటీఆర్ విదేశాల్లో ఎందుకు తిరుగుతున్నారు? కేసీఆర్ రాష్ట్రం వదిలి దేశంలో ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. ప్రశాంత్ కిషోర్ చెప్పారని కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు అప్పుల మయం అవుతుందన్నారు. ఇప్పటికే ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. దోచుకున్న డబ్బుని కాపాడుకోవడానికి కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉండటంతో మద్దతు కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో ఒక్కరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ కి డబ్బులు అవసరం కనుకే కేసీఆర్ తో కలుస్తున్నారని ఆరోపించారు. పార్ధసారధి రెడ్డి ఇంట్లో 500 కోట్లు రెండ్ హేండెడ్ గా దొరికినా.. ఆయనకు టీఆర్ఎస్ రాజ్యసభ సీటు ఇచ్చిందన్నారు. బీజేపీ వాళ్లు పార్ధసారధికి రాజ్యసభ సీటు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు.

KA Paul On Telangana : తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే..నేనే..నేనే-కేఏ పాల్ హాట్ కామెంట్స్

పార్ధసారధి రెడ్డిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ప్రశ్నించేవారు లేరన్నారు. కాంగ్రెస్ లో ప్రశ్నించే ఇద్దరు, ముగ్గురికి నెలకి కోటి రూపాయలు ఇస్తున్నారు.. అందుకే ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. 1200 అమరవీరుల కుటుంబాల్లో ఒక్కరు కూడ దొరకలేదా..? వేల కోట్లు ఇచ్చేవాళ్లు దొరికారా అని ప్రశ్నించారు. కేసీఆర్.. పార్ధసారధి రెడ్డిని కాపాడలేరు..కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కాపాడేవారే లేరని స్పష్టం చేశారు.

కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల కుటుంబాల వారికీ సీట్లు ఇవ్వండి, అమరవీరుల కుటుంబాలకి డబ్బులు ఇవ్వండని సూచించారు. బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ముందస్తు ఎన్నికలకు వస్తున్నారు అంటే వాళ్ళు దివాళా తీసినట్లేనని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడంతో పాటు అప్పులు లేకుండా చేస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలు తనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

KA Paul Fires : చంద్రబాబు దేశాన్ని నాశనం చేశాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్-కేఏ పాల్

కాంగ్రెస్ వాళ్లకి ఓటు పర్సెంటేజ్ లేక పిచ్చి పట్టి తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. తమతో పొత్తులు పెట్టుకోమని అన్ని పార్టీల వాళ్లు తమ దగ్గరకు వస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డిజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న టాక్స్ ను వెంటనే తగ్గించాలన్నారు. దేశాల్లో, రాష్ట్రాల్లో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి..గెలిచినవారు వేల కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో మరల ఎన్నికల్లోకి వెళుతున్నారని పేర్కొన్నారు.