Pregnant Woman Suicide : మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని.. కాన్పుకు ముందురోజే గర్భిణీ ఆత్మహత్య

కాన్పు సమయం దగ్గరపడుతుంటే.. సంబరానికన్నా ముందు సందేహం ఆమె మదిని తొలిచేసింది. తన భయానికి.. డాక్టర్‌ తప్పుడు రిపోర్ట్‌ ఆజ్యం పోసింది.

Pregnant Woman Suicide : మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని.. కాన్పుకు ముందురోజే గర్భిణీ ఆత్మహత్య

Suicide

Pregnant woman commits suicide : అమ్మ కాబోతుంటే ఏ అమ్మాయి అయినా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటుంది. ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది.. అంటూ .. బిడ్డ అచ్చట్లు ..ముచ్చట్లు.. అనుభూతులతో .. క్షణ క్షణం కాలం గడుపుతుంది. కానీ ఈ తల్లి మాత్రం.. భయం నీడలో బతికింది. ఒకవేల కడుపులో ఉన్నది అమ్మాయే అయితే .. రెండోసారి అమ్మాయే అతిథిగా వస్తే.. అత్తింటివారు ఏమంటారో.. భర్త నుంచి ఎలాంటి చీత్కారాలు పడాల్సి వస్తుందో.. ఈ ఆలోచనలతోనే తొమ్మిది నెలలు తొమ్మిది యుగాలుగా గడిపింది.

కాన్పు సమయం దగ్గరపడుతుంటే.. సంబరానికన్నా ముందు సందేహం ఆమె మదిని తొలిచేసింది. తన భయానికి.. డాక్టర్‌ తప్పుడు రిపోర్ట్‌ ఆజ్యం పోసింది. భయంతోనో .. బాధతోనో 9 నెలలు బిడ్డను కడుపులో పెట్టుకు చూసిన ఆ అమ్మ మనసు .. తెల్లవారితే కాన్పు అనే సరికి మాత్రం.. నిలకడగా ఉండలేకపోయింది. అమ్మో మళ్లీ అమ్మాయే అనే దిగులుతో.. ప్రాణం పోయాల్సిన తల్లి.. చేజేతులా బిడ్డ ఊపిరి తీసేసింది. చివరకు తానూ కన్నుమూసింది.

Constable : మిస్టరీగా మారిన కానిస్టేబుల్ మిస్సింగ్

ఈ హృదయవిదారక ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఆనంద్‌తో .. దండెపల్లి మండలం నర్సపూర్‌కు చెందిన రమ్యకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. తొమ్మిది నెలల క్రితం రమ్య మళ్లీ గర్భం దాల్చడంతో.. భర్త స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అయితే 15 రోజుల క్రితం రమ్య భర్తతో కలసి నర్సాపూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ప్రసవం అయ్యేంతవరకూ పుట్టింట్లోనే ఉంటానని భర్తతో చెప్పి .. తల్లి శారద వద్దే ఉండిపోయింది. అయితే ఈ నెల 3న వైద్య పరీక్షల కోసం రమ్య తల్లితో కలసి మంచిర్యాలకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆనంద్‌ ఆస్పత్రికి చేరుకుని రమ్యను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా.. తాను నిరాకరించింది.

అయితే డాక్టర్‌ ఈ నెల 6వ తేదీకి డెలివరీ డేట్‌ ఇవ్వడంతో .. కూతురును అల్లుడి ఇంటికి తీసుకుని వెళ్లిన శారద.. రమ్యను అక్కడే ఉండాలని చెప్పింది. కానీ గురువారం కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లాల్సిన రమ్య.. తనకు ఆడపిల్ల పుడితే అత్తింటివారు ఏమంటారోనని ఆందోళన చెంది .. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కన్నబిడ్డ మృతితో రమ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Incentives Increase : ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ ఇన్సెంటివ్స్ 30 శాతం పెంపు

కడుపులో ఉన్న శిశువు ఆడా, మగా అని చెప్పడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ మంచిర్యాలకు చెందిన ఓ వైద్యుడు రమ్యకు పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పడంతోనే.. ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలికి బంధువైన వైద్యుడు.. ఆడపిల్ల పుడుతుందని చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమించిన ఆ వైద్యుడు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నట్లయింది. అయితే బాధిత కటుంబం డాక్టర్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇటు రమ్య అత్తింటి వారిపై .. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు .. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

డెలివరీ సమయం వరకూ తల్లి దగ్గర ఉన్నా.. ఈ తల్లి ప్రాణాలు.. ఆ బిడ్డ ఊపిరి మిగిలేవేమో. లేదంటే తొమ్మిది నెలలు ఒపికతో ఉన్న అమ్మ మనసు .. ఇంకొక్కరోజు ఉన్నా.. తాను కోరుకున్న విధంగా మగశిశువు తన ఒడిలో ఆనందాన్ని నింపేవాడేమో.. అలాజరిగితే .. రెండు ప్రాణాలు.. ఒక్క జీవితంగా కలసి నడిచేవి. కానీ తొందరపాటు.. సమాజంలో ఆడపిల్ల అంటే ఉన్న చిన్నచూపు .. ఓ తల్లికి బిడ్డ ముఖం చూడకుండానే ప్రాణాలు తీసుకునేలా చేసింది.