Covid-19: నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేసేందుకు భయపడుతున్న వైద్యులు

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. గత పది రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఇది ఇలా ఉంటే నిండి గర్భిణికి కరోనా నిర్దారణ కావడంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు వైద్యులు వెనకడుగు వేస్తున్నారు.

Covid-19: నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేసేందుకు భయపడుతున్న వైద్యులు

Covid 19

Covid-19: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. గత పది రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఇది ఇలా ఉంటే నిండి గర్భిణికి కరోనా నిర్దారణ కావడంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు వైద్యులు వెనకడుగు వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.

కరోనా పాజిటివ్ రావడంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు వైద్యులు వెనకడుగు వేస్తున్నారు. హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తున్నారు. ఐతే మహిళ కుటుంబ సభ్యులకు అంత స్తొమత లేదు. హైదరాబాద్ వెళ్లేందుకు ఛార్జీలకు కూడా డబ్బు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాధారణ డెలివరీ అయ్యే అవకాశం కనిపించడం లేదని డాక్టర్లే చెబుతున్నారు. ఇదే విషయమై ఆసుపత్రికి సూపరిండెంట్ ను ప్రశ్నిస్తే వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు.