Ram Nath Kovind : రామానుజులు.. దేశ ప్రజల్లో సమతా చైతన్యం నింపారు-రాష్ట్రపతి కోవింద్

రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు.

Ram Nath Kovind : రామానుజులు.. దేశ ప్రజల్లో సమతా చైతన్యం నింపారు-రాష్ట్రపతి కోవింద్

Ram Nath Kovind

Ram Nath Kovind : రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. సమతామూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ట జరిగిందని అన్నారు. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని, ఇక్కడి శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.

శ్రీ రామానుజాచార్యులు సామాజిక అసమానతలను రూపుమాపారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెల్లడించారు. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారని తెలిపారు. అలాంటి మహనీయుడి స్వర్ణమూర్తిని నెలకొల్పి చిన్నజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు.

WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!

”దైవభక్తి ద్వారా ప్రజలకు ముక్తి లభిస్తుందని రామానుజులు చాటి చెప్పారు. సాంస్కృతిక విలువల ఆధారంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. శ్రీరంగం, కాంచీపురం, వారణాశి నుంచి తన సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేశారు. భారత్ లో భక్తి మార్గం దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లింది. ఉత్తర భారత్ సాధువులు రామానుజుల సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారు. తన సిద్ధాంతాలతో రామానుజులు దేశవ్యాప్తంగా భక్తి వెలుగులు నింపారు. కబీర్, దయాళ్ వంటి సాధు సంతువులకు భక్తి మార్గం చూపారు. పీడితవర్గాల అభ్యున్నతి కోసం రామానుజులు పాటుపడ్డారు. సమతా ప్రవచనాలతో అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావడానికి దోహదం చేశారు. జ్ఞాని ఎప్పుడూ అన్ని ప్రాణులను సమానంగా చూస్తారు. గాంధీజీ జైలులో ఉన్నప్పుడు రామానుజ చరిత్ర చదివారు. గాంధీ జీవన విధానంపైనా రామానుజుల ప్రభావం ఉంది” అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.

హైదరాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో సమతామూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆశ్రమానికి వచ్చిన రాష్ట్రపతి దంపతులకు చిన్నజీయర్ స్వామి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించారు. అనంతరం రామానుజాచార్యుల పసిడి విగ్రహాన్ని ఆవిష్కరించి లోకార్పణ చేశారు. సమతామూర్తి కేంద్రంలో శిలాఫలకాన్ని కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఆశ్రమానికి విచ్చేసిన రాష్ట్రపతి దంపతులకు.. చిన్నజీయర్ స్వామి సమతామూర్తి కేంద్రం విశేషాలను వివరించారు.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామానుజుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారు విగ్రహం రూపొందించారు. సమతామూర్తి కేంద్రం భద్రవేదిలోని మొదటి అంతస్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.