Ram Nath Kovind : ఈ నెల 29న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

రాష్ట్ర‌పతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో కోవింద్ బ‌స చేయ‌నున్నారు.

Ram Nath Kovind : ఈ నెల 29న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Ram Nath Kovind Hyderabad Tour

Ram Nath Kovind : రాష్ట్ర‌పతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్, బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిలయానికి చేరుకొని అక్కడే ఐదు రోజులు ఉంటారు. ఐదు రోజులపాటు అనగా వచ్చే నెల మూడో తేదీ వరకు రాష్ట్రపతి నిలయంలో ఉండనున్నారు.

చదవండి : President Ram Nath Kovind : శీతాకాల విడిది కోసం ఈనెలాఖరున హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి

రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ స‌మావేశ‌మ‌య్యారు. భద్రతా, రోడ్ మ్యాప్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అవ‌స‌ర‌మైన మేర‌కు ర‌హ‌దార్ల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి భవన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు.

చదవండి : Ram Nath Kovind : సొంతూరికి స్పెషల్ ట్రైన్‌లో రాష్ట్రపతి దంపతులు

ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 21 నుంచి 24 వరకు కేరళలో పర్యటించనున్నారు. మంగళవారం కాసర్‌గోడ్‌లో జరిగే కేరళ సెంట్రల్ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తారు. బుధవారం (డిసెంబర్ 22) కొచ్చిలో సదరన్ నేవల్ కమాండ్ నిర్వహించే కార్యాచరణ ప్రదర్శనను ఆయన వీక్షించనున్నారు. డిసెంబర్ 23న తిరువనంతపురంలో పీఎన్ పనికర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. సాయంత్రం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. డిసెంబరు 24 ఉదయం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు తెలిపారు.

చదవండి : Ramnath Kovind: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్